పారిశ్రామిక ప్రగతిలో ‘వైఎస్ఆర్’ది ప్రత్యేక బ్రాండ్ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి

-వైఎస్ కృషి వల్లే శ్రీసిటీ, బ్రాండిక్స్ లాంటి మెగా పరిశ్రమలు
-‘వైఎస్ఆర్’ 13వ వర్ధంతి సందర్భంగా నివాళి

అమరావతి, సెప్టెంబర్ , 02 : వైఎస్ హయాంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టిందని..అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం పరిశ్రమల ప్రగతివైపు దూసుకెళ్తోందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. శ్రీసిటీ, బ్రాండిక్స్ లాంటి మెగా పరిశ్రమలతో వైఎస్ఆర్ ఒక ప్రత్యేక బ్రాండ్ సృష్టించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వర్ధంతి సందర్భంగా ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి నివాళి అర్పించారు. ఆ మ‌హానేత శ‌రీరానికి మాత్రమే మ‌ర‌ణమని.. వైఎస్ఆర్ ఆత్మీయ పాలన, సంక్షేమ ప‌థ‌కాలు, పారిశ్రామికాభివృద్ధి ఎప్పుడూ అమరమేనని ఛైర్మన్ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించిన వైఎస్ శైలిని ఈ సందర్భంగా ఛైర్మన్ స్మరించుకుంటూ స్మృత్యాంజలి పలికారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీ సహా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.

Leave a Reply