Suryaa.co.in

Features

అక్షరమే ఆయుధం

అక్షరమే ఆయుధం
అక్షరమే అభివృద్ది
అక్షరమే పోరాటం
అక్షరమే సర్వస్వం

అక్షరమే రాకుంటే
అక్షర జ్ఙానమే లేకుంటే
జరగబోయే నష్టాన్ని
అక్షరాల్లో చెప్పలేం

ఆస్తులు కోల్పోయారు
హక్కులు కోల్పోయారు
బానిసలుగ బతికారు
అప్పుల పాలయ్యారు

అక్షర జ్ఙానం ఉంటే
ఆస్తులతో పనిలేదు
అధికారం నీసొత్తు
పోరాటం నీ హక్కు

అక్షరం ఒక వెలుగు
అక్షరం ఒక జిలుగు
అక్షరం ఒక మలుపు
అక్షరం ఒక గెలుపు

అక్షరమంటే చదవడం,
అక్షరమంటే వ్రాయడం,
అక్షరమంటే వినడం
అక్షరమంటే మాట్లాడటం

అక్షరమంటే సృష్టించడం
అక్షరమంటే గుర్తించడం
అక్షరమంటే లెక్కించడం
అక్షరమంటే విజ్ఙానం

అందుకే
అక్షరం విలువ తెలుసుకో
అక్షర జ్ఞానం పెంచుకో
అక్షరాలు నేర్వడమే కాదు
నేర్పించడమూ నేర్చుకో

అప్పుడే నిరక్షరాస్యతను
సమూలంగా నిర్మూలించగలం
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలతో…

సాంబ

LEAVE A RESPONSE