Suryaa.co.in

Andhra Pradesh

సాగర తీరాన సంతోష‘యోగ’ం!

విశాఖ: సాగర తీరాన వెల్లివిరిసిన ఈ ఉత్సాహపూరిత వాతావరణం చూసి సముద్రం సైతం పరవశించిపోయింది. అలల రూపంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉప్పొంగింది. లక్షలాది జన సందోహం ఒక్కసారిగా తనకు ప్రణమిల్లుతుంటే, ఆకాశం నుంచి సూర్యుడు ఆశీస్సుల వర్షం కురిపించాడు.ఈ అపురూప ఘట్టంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయం అనంతమైన పులకింతకు లోనైంది.

సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా, ప్రపంచ రికార్డులను తిరగరాస్తూ విశాఖపట్నం నిలిచింది. ‘ఈ ఆంధ్ర ఏం తలపెట్టినా సాధించగలదు కదా!’ అని ప్రపంచం నివ్వెరపోయింది. అద్భుతాలకు వేదికైన విశాఖకు అభివందనం!

ఈ మహత్తర కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులకు, దీనిని విజయవంతం చేసిన లక్షలాది మందికి హృదయపూర్వక అభినందనలు.

LEAVE A RESPONSE