– రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసిన పొంగూరు కృష్ణప్రియ
– మాజీ మంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసిన పొంగూరు కృష్ణప్రియ
– మాజీ మంత్రి నారాయణ వేధింపుల పర్వం..
– పోలీసులను ఆశ్రయించిన ప్రియ
మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రియ గళమెత్తింది.ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని ప్రియా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
తనను వేధిస్తున్నారని రాయదుర్గం పీఎస్‌లో టీడీపీ మాజీ మంత్రి నారాయణపై ఫిర్యాదు.సోషల్ మీడియా వేదికగా… టీడీపీ మాజీమంత్రి నారాయణ పెట్టిన హింసలను..ప్రియా ప్రజల దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాను వీడియోలు విడదుల చేసిన తరువాత, మాజీ మంత్రి నారాయణ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు ప్రియా పేర్కొన్నారు.