ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సైకో తత్వానికి నిదర్శనం

– నిరంకుశత్వ పాలనలో నిరసనలు తెలియజేసే హక్కు పౌరులకు లేదా?
– ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా?
– అనగాని సత్యప్రసాద్

రాజ్యాంగం కల్పించిన హక్కులను జగన్ ప్రభుత్వం హరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.జగన్ రెడ్డి నియంతృత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జనవరి 19, 2023న అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ను కలిసినందుకు వేధింపు చర్యలకు దిగుతున్నారు. జిపిఎఫ్‌, బీమా సొమ్ముల్ని జగన్ వాడుకోవడం, సమయానికి జీతాలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించకుండా ప్రశ్నిస్తే వేధిస్తారా?

రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ ఫైనాన్షియల్ కోడ్‌లోని 72వ నిబంధన ప్రకారం ఉద్యోగులు, పెన్షన్లు, ఇతర క్లెయిమ్స్‌ను మొదటి హక్కుదారులుగా చేర్చాలని గవర్నర్‌ను కోరడం నేరమా? రాష్రంలో హత్యలు చేసిన నేరస్తులు యదేచ్చగా తిరుగుతున్నారు, కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఉద్యోగులు మాత్రం బిక్కు బిక్కుమంటు బ్రతుకుతున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణతో పాటు మిగిలిన సభ్యులపై పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులకు పాల్పడుతున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నించినందుకు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు.

వేతనం పొందటం ఉద్యోగుల హక్కు కాదా? సలహాదారులకు క్రమం తప్పకుండా వేతనాలు,అలవెన్సులు చెల్లిస్తూ ప్రభుత్వం సీపీఎస్ రద్దును అమలు చేయమన్నందుకు ఉపాధ్యాయులపై దాడులు చేయించారు. వేతనం పొందటం ఉద్యోగుల హక్కు కాదా? సలహాదారులకు క్రమం తప్పకుండా వేతనాలు, అలవెన్సులు చెల్లిస్తూ ఉద్యోగులకు మాత్రం వేతనాలు ఇవ్వరా? రెండు డీఏలకు సంబంధించిన 60 నెలల బకాయిలు ఓపిఎస్ ఉద్యోగాలు ఖాతాల్లోకి జమకాని వాస్తవం కాదా? టెక్నికల్ సమస్య పేరుతో ఉద్యోగుల జీపీ ఎఫ్ ఖాతాల నుంచి వెనక్కి తీసుకున్న నగదును ఇంతవరకు తిరిగి ఎందుకు జమచేయలేదు? 11 వ పీఆర్సీ అమలులోకి వచ్చి సంవత్సరన్నర కాలం గడిచినా ఒక్కో ఉద్యోగిని రావాల్సిన బకాయిల లెక్కలు ఇప్పటికీ ఎందుకు తేల్చలేదు? వీటిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇకనైనా ఉద్యోగులపై కక్ష్యసాధింపు చర్యలు ఆపి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి.

Leave a Reply