– కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, కష్టాలు, కన్నీళ్లు
రైతు బీమా రద్దు చేయాలని అంటున్నారు.. రద్దు చేద్దామా?
– పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బాయిల కాడా మీటర్లు పెట్టి 32 వేళ కోట్లు తెచ్చుకుంది
– మంత్రి హరీష్ రావు
గజ్వేల్ మహతి ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ అధికారులకు నిర్వహించిన వానాకాలం సాగుకు సన్నాహక సమావేశానికి మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఏమ్యేల్సి పళ్ళా రాజేశ్వర్ రెడ్డి , ఏమ్యేల్యే లు ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, పద్మదేవెందర్ రెడ్డి ,రసమయి బాలకిషన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఏమన్నారంటే…
వచ్చే వానాకాలం ఏ పంటలు వేస్తే రైతులకు మేలు జరుగుతదో ఆలోచించాలి.గతంలో ఎండాకాలం వచ్చింది అంటే అంబలి కేంద్రాలు, రైతుల ఆత్మహత్యలు, ధర్నాలు ఆందోళనలు.ఐదేళ్లలో మార్పు తెచ్చాము. ఇప్పుడు ఏ మూలకు వెళ్లిన ధాన్యపు సిరులు కనిపిస్తున్నాయి. భూమికి బరువయ్యబత పంట పండిస్తునము.
నిన్న ఎవడో వచ్చి రైతు డిక్లరేషన్ అంటుండు.కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, కష్టాలు, కన్నీళ్లు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో 24 గంటల
కరెంట్, సాగు నీళ్లు, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. రైతు బీమా రద్దు చేయాలని అంటున్నారు.. రద్దు చేద్దామా? రైతు బీమా అంటే ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు.. కానీ రైతు బీమా రైతు ఏ ప్రమాదంతో మరణించినా అందిస్తున్నాము.. రైతు కుటుంబాన్ని అదుకుంటున్నాం.
అత్యధికంగా రైతు ఆత్మహత్యలను తగ్గించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ అని కేంద్రం చెప్పింది.బీజేపీ బాయిల కాడా మీటర్లు, బోర్లు కాడా మీటర్లు అంటున్నారు.నల్ల చట్టాలు తెచ్చి రాష్ట్రానికి రావలసిన 25 వేల కోట్లు కేంద్రం అపుతోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బాయిల కాడా మీటర్లు పెట్టి 32 వేళ కోట్లు తెచ్చుకుంది. బీజేపీ అధికారంలో వస్తే ఉచిత కరెంట్ వస్తాదా బీజేపీ పాలిట రాష్ట్రాల్లో తెలంగాణ లో ఇచ్చినట్లు ఉచిత కరెంట్, రైతు బంధు, బీమా కోసం డిమాండ్ చేయాలి. బీజేపీ వస్తే బాయిల కాడా మీటర్లు, కాంగ్రెస్ వస్తే చీకటి రోజులు వస్తాయి.
రైతు ప్రతినిధులుగా రైతులకు దిశానిర్దేశం చేయాలి. ఆయిల్ ఫామ్ సాగు వల్ల జరిగే లాభాలు రైతులకు వివరించాలి. వరి కంటే మూడు, నాలుగు రెట్లు అధిక లాభం.వచ్చే ఏడాది నాటికి మెదక్ లో ఆయిల్ పామ్ సాగు. ఆయిల్ ఫామ్, సెరికల్చర్ సాగు లాభాదాయకంగా ఉంది.ఈ ఏడాది మీ ప్రాంతాల్లో కనీసం 10 శాతం సాగు వెడసాగు పద్దతిలో వేయాలి.
సిద్దిపేట, మెదక్ జిల్లాలో కనీసం 25 వేళ ఎకరాల చొప్పున విత్తన సాగు చేపట్టాలి. ప్రధానంగా పచ్చి రొట్ట విత్తనాల సాగు పెంచాలి. పత్తి సాగును కూడా బాగా పెంచాలి.. ఇతర పంటలకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడం ద్వారా అద్భుతాలు సృష్టించొచ్చు. తెలంగాణలో సర్కారు ఉద్యోగికి ఎంత డిమాండ్ ఉందో.. రైతుకు అంతే డిమాండ్ వచ్చింది.
ఎంతో మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ములుగు రీసెర్చ్ సెంటర్ లో మిరపసాగు నారు పెద్ద ఎత్తున అందించాలి.. రైతులకు మేలు జరుగుతది. గజ్వేల్, మెదక్ లో రాక్ పాయింట్ ఏర్పాటు చేయించి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి.. అద్భుతమైన ఉత్పత్తి సాధించి, రైతు రాజు కావడమే సీఎం కేసీఆర్ కు ఇచ్చే బహుమానం.