Suryaa.co.in

Andhra Pradesh

చంద్రయాన్ అనుభూతి కల్పించిన జలగన్నకు హేట్సాఫ్!

– నారా లోకేష్

సడన్ గా చూసి దీనిని చెరువు అనుకుంటున్నారు కదా… మీ మీద ఒట్టు ఇది నిజంగా రోడ్డే… ఒకవేళ మీరు నమ్మకపోతే తప్పులో కాలేసినట్లే… మొగల్తూరు సమీపంలోని పడమటివారిపాలెం వద్ద ప్రధాన రహదారి ఇది. రాష్ట్రంలో జలగన్న గుంతల పథకానికి ఇదో మచ్చుతునక మాత్రమే. 2800 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్రలో ఇంత దారుణమైన రోడ్లను నేను ఎక్కడా చూడలేదు. గోదావరి జిల్లాలంటే పచ్చటి ప్రకృతిసోయగాలు మాత్రమే తెలిసిన నాకు ఈరోజు చంద్రయాన్ – 3 విడుదల చేసిన చిత్రాలు గుర్తొచ్చాయి. రూపాయి ఖర్చులేకుండా చంద్రుడి మీదుకు వెళ్లిన అనుభూతి పొందాలంటే మీరు కూడా ఇక్కడకు రావొచ్చు. ఎవరేమనుకున్నా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటూ విదేశాల్లో విహార యాత్ర చేస్తున్న జలగన్నకు హేట్సాఫ్…!

LEAVE A RESPONSE