జై చిరంజీవా..జగదేకవీరా..
ఆ పేరుకి..ఈ పాటకి
న్యాయం చేస్తూ మెగాస్టార్
ఎన్నెన్నో సేవాకార్యక్రమాలు..
తాను చిరంజీవి గనక ఎంతోమందిని చిరంజీవులుగా
మార్చే వితరణ..
ప్రాణం పోసింది బ్రహ్మ..
ఆ ప్రాణం నిలిపేది
ఈ సినీ బ్రహ్మ!
చిరుకి సేవా
కార్యక్రమాలు కొత్తా..
ఎన్నిసార్లు చూపించలేదు
తన సత్తా…
ఎంతో మంది
అభిమానులకు తెలుసు..
చిరంజీవి ఇచ్చే మనసు..
నటనతో వినోదం..
సేవతో ప్రమోదం
ఇలా చాలా చేస్తేనేగా అయ్యాయి ఎంతోమంది అభిమానుల హృదయాలు
ఈ కొణిదెలకు కోవెల..!
ఫూలే స్ఫూర్తి..
అంతులేని కీర్తి..
సినిమాల ద్వారా
విశ్వవ్యాప్తి..
ఆయనే ఒక శక్తి..
తనను పెంచిన అభిమానులకు..
ఆదరించిన ప్రజలకు
తిరిగి ఇవ్వాలన్న తలపు
బ్లడ్ బాంక్ ఆలోచనకు మేలుకొలుపు..
సేవా కార్యక్రమాల్లో మేలిమలుపు..!
నేను సైతం అంటూ
ఆర్తుల రక్షణకు
నడుం కట్టి..
కళ్ళు మూసి తెరిచేలోగా కార్యరూపం..
సినిమాల్లో సుప్రీం హీరో
సేవలో ఏం చేసినా అంతే వేగంతో కరో..
అభిమానులే సైనికులై
మనోబలమే పెట్టుబడై
గాలి కంటే వేగంగా
ఆ గాలినే ప్రాణవాయువుగా
ఆపన్నుల ఆయువుగా మలచి ప్రజల
గుండెల్లో నిలిచి..!
అలా అనుకుని..
ఇలా చేస్తాడు
గనకనే అతడయ్యాడు ముఠామేస్త్రీ..
చెప్పింది చేసే ఠాగూర్..
అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన అందరివాడు..
అందుకే ఈ తెలుగు నేల
ఎప్పుడో అనేసింది..
జై చిరంజీవా..!
మొత్తానికి ఈ చిరంజీవి..
జనహృదయాల్లో ఎప్పటికీ చిరంజీవి..ధన్యజీవి!
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286