ఆమె..
‘నేటిభారతం’లో ‘ ప్రతిఘటన
‘కర్తవ్యం’గా పెట్టుకున్న రాములమ్మ..
దుర్యోధన దుశ్శాసన దుర్నిరీతి లోకంలో
గ్యాంగ్ లీడర్ లను
ఆటపట్టించిన భారతనారి..
ఇటు కమర్షియల్ సినిమాలు
అటు ఎర్ర బొమ్మల్లో
దడాదడా నటించేసిన
ముద్దుగుమ్మ..
ఒసేయ్ రాములమ్మ..!
ఐపిఎస్ వైజయంతి
మన విజయశాంతి..!!
అందం..అభినయం..
స్టెప్పులు..గెటప్పులు…
లాకప్పులు..దేనికి తగ్గట్టుగా
ఆ మేకప్పులు..
పోలీస్ అధికారి
తానే అన్నట్టు..
కిరణ్ బేడీని
పోలినట్టు అదరగొట్టిన
వైజయంతి..
హిందీలోనూ
తేజస్వినిగా హవా..
లేడీ అమితాబ్ స్టేటస్
దేశం మొత్తం ఆమె పాటకు
పాడింది కోరస్..!
చిరుతో వేస్తే అతగాడికి తగ్గట్టు అల్లరి..
అట్ట సూడమాకయ్యా
అంటూ మురిపెం..
వెంకీతో నెలరాజా
తెర తీయవా..
ఆ పాటలో
ఊరించే పాలకోవా..
ఇక బాలయ్యతో గోలయ్య..
రచ్చ రచ్చ జనం మెచ్చ..
యువసామ్రాట్ తోనూ
నా గొంతు శృతిలోన..
రెండు జన్మలెత్తిన
జానకి..వరస
హిట్టు సినిమాల
కథానాయకి..!
హీరోలకు ధీటుగా పాత్రలు
వాటికి తగినట్టుగా బిరుదులు..
లేడీ సూపర్ స్టార్…
రెబల్ కూడా అయింది
ఈ బుల్ బుల్…
వనితల్ నేర్వగ రాని
విద్య గలదె..
ఆర్యోక్తిని నిజం చేస్తూ..
రఫ్ఫాడించేస్తూ..
కేరీర్ మొత్తం
శ్రీరస్తు..శుభమస్తు..!
హ్యాపీ బర్త్ డే విజయశాంతి
– సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286