హెచ్.సీ.యూలో మొదలైన పబ్లిక్ పాలసీ జాతీయ సదస్సు

0
10

హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం లోని రాజనీతి శాస్త్ర విభాగం నిర్వహిస్తున్న ” 75 ఏండ్ల లో పబ్లిక్ పాలసీ – ఒక పునరావలోకనం” అనే అంశం పై 2 రోజుల జాతీయ సదస్సు లో భాగంగా మొదటి రోజు విజయవంతంగా జరిగింది.

ఈ జాతీయ సదస్సు కి ముఖ్య అథిది గా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్. ఆర్. లింబాద్రి మాట్లాడుతూ.. పబ్లిక్ పాలసీ పరిశోధన ని తెలంగాణ వ్యాప్తంగా బలోపేతం చేస్తాం. ఇప్పటికే ప్రభుత్వ పాలనా శాస్త్ర కోర్సు ని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశ పెట్టాం. ఇప్పటి నుండి యాజమాన్య, సాంకేతిక విద్యా సంస్థల్లో విస్తరించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ విధానాల్లో ప్రధానంగా నాలుగు వర్గాలు పాలుపంచుకుంటాయి.. అవి, ప్రభుత్వ యంత్రాంగం, మేధావులు, పౌర సమాజ సేవ సంస్థలు మరియు రాజకీయ ప్రాభల్యం కల్గిన సామాజిక వర్గాలు.. ఇలాంటి పాలనా నిర్మాణం లో ప్రజల పాత్ర ఎక్కడ ఉందని లింబాద్రి ప్రశ్నించారు.

ప్రముఖ ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్త ప్రొఫెసర్. హరగోపాల్ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రభుత్వం ప్రజల గూర్చి విధానాలు రూపొందిస్తూ ఉండేది. ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలను ప్రైవేట్ సంస్థలు అనుకరించే వాళ్లు. నయా ఉదారవాద విధానాల వలన ప్రభుత్వ సంస్థలు కనుమరుగు అవుతున్నాయి అని వాపోయారు.

ఒకప్పుడు ప్రభుత్వాలు విధాన రూపకల్పన లో భాగం అయితే, ప్రస్తుతం కార్పోరేట్ సంస్థలు మరియు విదేశి శక్తులు ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తున్నాయి మరియు ప్రభావితం చేస్తున్నాయి అని తెలిపారు.

అంతర్జాతీయ ప్రభుత్వ పాలనా సంస్థ ప్రధాన కార్యదర్శి ఫిలిప్ జిట్టాన్ (ఫ్రాన్స్) మాట్లాడుతూ.. వైవిధ్య సంస్కృతి కల్గిన భారతదేశం అభివృద్ధి పథం లో నడవాలంటే బలమైన ప్రభుత్వ విధానాలు ఎంతో కీలకం అని తెలిపారు.

ఈ జాతీయ సదస్సు కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్. వెంకటేశు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చెవి గా ఉండాలని చెప్పారు.

ఈ సదస్సు లో రాజనీతిశాస్త్ర విభాగాధిపతి ప్రొ. ఖాం ఖాన్ సుహాన్, సెమినార్ కో-కో ఆర్డినేటర్ డాక్టర్. డి. వీరబాబు, ప్రొ. జి. సుదర్శనం, ప్రొ.అజయ్ గుడవర్తి, ప్రొ.సంజయ్ కుమార్, ప్రొ. రాందాస్ రుపావత్, ప్రొ. జి. నాగరాజ్, ప్రొ. ముకుల్ సక్సేనా, ప్రొ.అజిత్ ఫడ్నిస్, ప్రొ. మ్రుదుల్ నీల్ ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్స్ , విద్యార్తులు పాల్గొనారు.