ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు

– నియోజకవర్గ ప్రగతికి నిధులు సాధించలేని ఎమ్మెల్యే పన్నులు పిండాలని టార్గెట్ పెడుతున్నాడు
-పన్నుల బాదుడు, బాధలు తప్పాలంటే సైకో ప్రభుత్వం దిగిపోయి సైకిల్ ప్రభుత్వం రావాలి
-నూతక్కి గ్రామంలో పర్యటన సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు

నియోజకవర్గంలో పేదలకు ఒక్క ఇల్లూ కట్టలేని చిన్న సైకో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వేలాది ఇళ్లు కూల్చేస్తున్నాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. నూతక్కి గ్రామంలో గురువారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో సమస్యలు పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వున్నా, ఆదుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. సైకో మాదిరిగా మారిన ముఖ్యమంత్రి పాలనలో పెంచిన ధరలు, చార్జీలు, పన్నులు గురించి ప్రజలకు వివరించారు. గ్రామస్తులు తన ద్రుష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

నియోజకవర్గ ప్రగతి కోసం వేల కోట్లు కేటాయించామంటోన్న ప్రభుత్వం, ఎమ్మెల్యే..అవి ఎక్కడ ఖర్చు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రగతి పనుల కోసం ఒక్క రూపాయి నిధులు సాధించలేని ఎమ్మెల్యే, పన్నుల పేరుతో ప్రజల్ని బాదాలని అధికారులకు టార్గెట్లు విధించడం దారుణమన్నారు. చివరికి ఖాళీ స్థలాలనీ వదలకుండా పన్నులు వసూలు చేయాలని అధికారికంగా ఆదేశించడం ఎమ్మెల్యే దోపిడీ బుద్ధికి నిదర్శనమన్నారు. పేదలకు ఒక్క ఇల్లూ కట్టి ఇవ్వలేని చిన్న సైకో నూతక్కి గ్రామంలో ఇళ్లు తొలగించేందుకు ప్రయత్నాలు చెయ్యడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా వుండి పోరాడుతుందని హామీ ఇచ్చారు. పన్నుల బాదుడు, ప్రజల బాధలు పోవాలంటే..సైకో ప్రభుత్వం పోయి సైకిల్ సర్కారు రావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply