ఈ ఫోటోలోని ఒక పెద్దాయనని చూడండి…
నిశితంగా గమనించండి.
మీకేమనిపిస్తోంది ?
ఆయనొక బ్రాహ్మణుడు…
వేదాలు చదివిన పండితుడు లేదా పూజలు చేయించే బ్రహ్మగారు లాగా అగుపిస్తున్నారు కదూ !
ఇకసలు విషయంలోకొస్తే…
ఆయననొక పేరుమోసిన డాక్టరు…
ఆంకాలజిస్టు..
కాన్సర్ స్పెషలిస్టు..
కేరళలోనే మొట్టమొదటి ఆంకాలజిస్టు..
ఆయనే….
కొట్టాయం మెడికల్ కాలేజీలో ఆంకాలజీ ప్రొఫెసర్…,
హెడ్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్ మెంటుగానూ…
తరువాత కొట్టాయం మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ గాను పనిచేశారు.
ఆయన 60సం.ల వయసులో రిటైరైన తరువాత ఒక ఫ్లయింగ్ డాక్టరుగా పేరుతెచ్చుకున్నాడు. అంటే 50 దేశాలకు విజిటింగ్ ప్రొఫెసరుగా వెళ్ళి, ఆంకాలజీ మీద లెక్చర్లు, రోగులకు చికిత్స చేసేవారు.
ఇకాయన ఎదురుగా కూర్చున్న వ్యక్తి పేరు బ్రహ్మశ్రీ సూర్యన్ సుబ్రమనియన్ భట్టాత్తిరి “సిద్ధ వైద్యుడు”…
అంతపెద్ద వయసులో ఆఁ ఆంకాలజీ స్పెషలిస్టుగారికి తను చదివింది చదువుకాదు, తన వైద్యం ఒక లెక్కలోనిది కాదు అవన్నీ వ్యర్ధం అనిపించింది. మళయాళంలో “అలాడా వైద్యన్ “ అంటే ఒక గిరిజన వైద్యుడన్నమాట. అలాంటి సిద్ధ వైద్యం చేసే వ్యక్తిని తన గురువుగా స్వీకరించాడు. పట్టుదలతో సిద్ధ వైద్యం నేర్చుకున్నాడు. ఈ గొప్ప వైద్యుడు సిద్ధ వైద్యంతో అనేకమంది రోగులను కాపాడాడు. అమెరికాలోని ప్రఖ్యాత ‘మాయ క్లినిక్’ తిరస్కరించిన రోగులను కూడ ఈయన తన సిద్ధ వైద్యంతో బ్రతికించాడు.
ఆయన వైద్యంతో బాటుగా , వేదాలు ఉపనిషత్తులను భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేశాడు. అంత పెద్ద వయసులో ఆయన తాంత్రిక కర్మలకి ప్రఖ్యాతిగాంచిన ‘సూర్యకాలాది మాన’ అనుసరించి “ ఉపనయన సంస్కారం” పొంది మెడలో జంధ్యం, రుద్రాక్షమాల ధరించారు. ఆయన జీవితమంతా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాచార్యుడిగా శేష జీవితాన్ని గడిపిన ధన్యుడు. ఆయన 92 సంవత్సరాల వయసులో ఈ మధ్యనే అంటే 20 అక్టోబరు 2021 తేదీన పరమపదించారు. ఏ ఒక్కమీడియా సంస్థ ఆయన గురించి రాయలేదు. కమ్యూనిస్టు జిహాదీ కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితేనేం ఆయనలోని విద్యా సరస్వతికి ఎవరైనా చేతులెత్తి నమస్కరించాల్సిందే.
మీకు ఉత్కంఠగా ఉంది కదూ !
ఇకాయన పేరేమిటో తెలుసుకోవాలనీ…,!
ఆయన నేపధ్యం ఏమిటో తెలుసుకోవాలనీ !
ఆతృతగా ఉంది కదూ !
ఆయన ఒక వెనకబడిన తరగతికి చెందిన ఒక క్రిస్టియన్… అవునండీ ఆయన జన్మతః ఒక “క్రిస్టియన్”…
పేరు CP మాథ్యూ….
సనాతనధర్మం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మమంటే, అది మతం కాదు ఒక జీవన విధానమనీ, అదొక సైన్సు ఆధారితమనీ మూఢత్వం కాదనీ తెలుసుకుని, ఆచరించి, బోధించిన మహనీయుడు. అతిముఖ్యమైన విషయం, ఆయన జన్మతః బ్రాహ్మణుడు కాకపోయినా, ఆయన జ్ఞానంచేత బ్రాహ్మణుడై, ఉపనయన సంస్కారం పొంది, బ్రాహ్మణుడిగా జీవించిన CP మాథ్యూ ధన్యుడు.. సనాతన ధర్మాన్నీ, కులాలను విమర్శించే వారికి ఆయన జీవితం ఒక కనువిప్పు కలిగించగలదు!!
