Home » రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్ గా మార్చి, యువతను మత్తులో ముంచి తేలుస్తున్నాడు

రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్ గా మార్చి, యువతను మత్తులో ముంచి తేలుస్తున్నాడు

– మత్తులో జోగుతున్న యువత మహిళలపై దారుణాలకు తెగబడుతుంటే, డీజీపీ పోలీసులు ప్రతిపక్షనేతలకు సుద్ధులుచెబుతున్నారు.
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్, అన్నపేరుని చంద్రబాబునాయుడు తీసుకొస్తే, 2019 తర్వాత తన అవినీతి, ధనదాహం చేతగానితనంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవినీతి ఆంధ్రప్రదేశ్, అత్యాచా రాంధ్రప్రదేశ్, చివరకు ఇప్పుడు డ్రగ్సాంధ్రప్రదేశ్ అని పిలిచేలా చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె తన నివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆమె మాటల్లోనే .. అమాయకులైన ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుం చుతాడని భావించి 151 మంది వైసీపీఎమ్మెల్యేలను గెలిపించారు. ఇప్పుడేమో ఈ ముఖ్యమంత్రి చర్యలు, చేష్టలతో ప్రజలంతా లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించారని, వివిధ దేశాలవారు ఆ దేశంనుం చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వారివారి దేశాలకు వెళ్లడానికి ప్రయత్నిం చడాన్నిఅందరమూ చూశాము. కానీ తాలిబన్లకంటే దారుణంగా, ఘోరం గా రాష్ట్రంలో జగబన్లు పేట్రేగిపోతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారి తీరుతో ప్రజలు ఎటుపోవాలో తెలియక తలలు పట్టుకొని రోదిస్తున్నారు.
ఇసుక, మద్యం, ఎర్రచందనం, గంజాయి, భూ ఆక్రమణలు, చివరికి ఇప్పుడు డ్రగ్స్ దందాలో జగబన్లు మునిగితేలుతున్నారు. ఆఖరికి తిరు మల శ్రీవారికి భక్తులు పవిత్రంగా సమర్పించే తలనీలాలను కూడా జగన్మో హన్ రెడ్డి ఆయనవర్గం తమఅవినీతికి వాడుకోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి అయినదగ్గరనుంచీ ఎలా సంపాదించుకోవాలి… ప్రజలను ఎలా దోచుకోవాలన్న ఆలోచనల్లోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన భూ దాహానికి, ధనదాహానికి ప్రజలు ఎంతలా బలవుతున్నా, తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాకుండా సుఖాల్లో మునిగితేలుతున్నాడు. ఇలాంటి ఆలోచనలుచేస్తున్న జగన్మోహన్ రెడ్డి బుర్రకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఎన్నికలకు ముందు నిరుద్యోగులను, యువతను రెచ్చగొట్టి, ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి వారిని మోసగించాడు. ఆనాడు ప్రతి పక్షనేతగా ఉండి, యువతీ యువకులను చంద్రబాబుపైకి రెచ్చగొట్టి, వారి ఓట్లు కాజేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రయ్యాక సదరు యువతీ యువకులను మద్యం మాంసం దుకాణాల్లో పనిచేసుకొని బతకమంటున్నాడు. నేడు రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు తాముచదివిన చదువులకు సరిపడిన ఉద్యోగం రాక, ఖర్చులకు తల్లిదండ్రలవద్ద చేయిచాచలేక ఎంతటి వేదన అనుభవిస్తున్నారో, ఈ ముఖ్యమంత్రికి తెలియడంలేదా? ఉద్యోగమో, ఉపాధో కల్పించి వారిని ఆదుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి, తన అక్రమార్జన కోసం వారిని మత్తుపదార్థాలకు బానిసలను చేస్తున్నాడు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు దొరక్కపోయినా డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) మాత్రం విచ్చలవిడిగా జరుగుతున్నాయి.
ఈ మాట తాము అనడంలేదు. ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటుదూరంలో యువతిపై అత్యాచారం జరిగి తే, ఆనాడు డీజీపీ,హోంమంత్రి మాట్లాడుతూ, ఆప్రాంతంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ లు తిరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆనాడు అలాచెప్పిన డీజీపీ, నేడు మాదకద్రవ్యాల వ్యాప్తి, వాడ కంపై ప్రశ్నించిన ప్రతిపక్షాలను తప్పుపడుతున్నాడు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలవాడకం పెరగడం, అత్యాచారాలు, హత్యలు జరగడానికి కారణం యువతీయువకులు పెడదారి పట్టడమే. వారికి సరైనఉపాధి, ఉద్యోగాలు కల్పించాల్సిన ముఖ్యమంత్రే వారిని తనఅక్రమార్జనకు పావులుగా వాడు కుంటున్నాడు.
ఇదివరకు దేశంలో ఎక్కడో ప్రధాన నగరాల్లో లభించే మాదకద్రవ్యాలు, నేడు రాష్ట్రంలో బడ్డీకొట్లలో సిగరెట్లు అమ్మినంత తేలిగ్గా డ్రగ్స్ అమ్మకాలుసాగిస్తోంది. ఈ దారుణాలపై యువతీయువకులు, వారి తల్లిదండ్రలు కూడాఆలోచన చేయాలని మనవిచేస్తున్నాం. ఈ ముఖ్య మంత్రి తన అవినీతికోసం ఆఖరికి ఒకతరాన్నే నాశనంచేయడానికి సిద్ధ మయ్యాడనే పచ్చినిజాన్ని పిల్లలు, వారితల్లిదండ్రులు గమనించాలని కోరుతున్నాం.
రాష్ట్రం ఎటుపోతున్నా, ప్రజలు చంకనాకిపోతున్నా ముఖ్యమంత్రి మాత్రం నోరువిప్పడు. ఇలా అనాల్సి వస్తున్నందుకు తాముకూడా సిగ్గుపడుతు న్నాం. ముఖ్యమంత్రి బయటకు రావాలంటే ప్రజలెవరూ రోడ్లపై ఉండకూ డదు. దుకాణాలు అన్నీమూసేయాలి. పోలీసులు తెరలు పట్టుకొని నిలబ డాలి. ఇవన్నీ జరిగితేగానీ, ఈ ప్రబుద్ధుడు కాలు బయట పెట్టాడు.
రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్ విచ్చలవిడిగా పేట్రేగిపోతున్నాకూడా ముఖ్యమంత్రికి పట్టదు. దాదాపు లక్షా90వేలకోట్లవిలువైన హెరాయిన్, ముఖ్యమంత్రికి ఇంటికి సమీపంలోని విజయవాడలో పట్టుబడితే, దానిపై ఆయన ఇంతవరకు సమాధానంచెప్పలేదు. హోంమంత్రేమో స్క్రిప్ట్ ఉంటే తప్ప నోరుతెరవరు. డీజీపీ ఏమో తాను ఐపీఎస్ అని మర్చిపోయి, ప్రజలను రక్షించడాన్ని పక్కనపెట్టి, జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆస్తులను, ఆయన మనుషులను రక్షించాలనే మూడుఅజెండాలతో ముందుకు వెళ్తున్నాడు. డీజీపీ అంత లా దిగజారిపోవడాన్ని చూసి తాముజాలిపడుతున్నాం.
హెరాయిన్ కు , రాష్ట్రానికి సంబంధంలేదని డీజీపీ ఎలాచెబుతారు? ఎక్కడో ఆఫ్ఘనిస్థాన్ నుంచి దిగుమతి అయిన హెరాయిన్లో మూడుటన్నులు గుజరాత్ లో పట్టుబడితే, ఆంధ్రప్రదేశ్ లో 25టన్నులవరకు పట్టుబడింది. పట్టుబడిన హెరాయిన్ (సరుకు) తాలూకా జీఎస్టీ నంబర్ చిరునామా విజయవాడది. ఆ విధంగా పక్కాగా ఆధారాలుకనిపిస్తుంటే, దానిగురించి లోతుగా విచా రించి, ఎవరుదోషులో తేల్చకుండా డీజీపీ పోలోమని మీడియా ముందు కొచ్చి, సిగ్గులేకుండా ప్రతిపక్షాలకు సుద్ధులు చెబుతున్నాడు. పరిపాలన ,ప్రజల రక్షణ గురించి డీజీపీ లాంటి వాళ్లు చంద్రబాబునాయుడి గారికి చెప్పడం చూస్తుంటే, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిన తీరుగా ఉంది. పోలీసులు, ప్రభుత్వం చేయలేని పనినితాముచేస్తుంటే, ఇళ్లల్లో కూర్చొని అప్పడప్పుడూ బయటకు వచ్చి మాపై విమర్శలుచేస్తారా?
జగన్మోహన్ రెడ్డిని, ఆయన చుట్టూ తిరిగే జగబన్లను ఎలాకాపాడాలి అనేదితప్ప పోలీసులకు మరో విధిలేదు. పోలీసులు మరోపనికూడా కచ్చితంగాచేస్తు న్నారు. టీడీపీ నేతలు ఎవరు బయటకువస్తున్నారు…ఏంమాట్లాడు తున్నారు…. వారిపై తప్పుడుకేసులు పెట్టి ఎలా అరెస్ట్ చేయాలనే ఆలోచనలు మాత్రం బాగా చేస్తున్నారు. టీడీపీపై, ప్రతిపక్షనేతలపై పోలీసులుపెట్టిన శ్రద్ధలో 25శాతమైనా సరే, రాష్ట్రంలో జరుగుతున్న దారు ణాలపై పెడితేమంచిది. రాష్ట్రంలోఆడబిడ్డలకు, చిన్నారులకు కూడా రక్షణ లేదు. భర్తకళ్లెదుటే మహిళలపై అత్యాచారానికి తెగబడుతున్నారు… ఆపే వాడు, అడిగేవాడు లేడన్నట్లు దుర్మార్గులు పేట్రేగిపోతున్నారు. అందుకు ప్రధానకారణం వైసీపీప్రభుత్వం సాగిస్తున్న మాదకద్రవ్యాల వ్యాపారం కాదా?
యువతీ యువకులు మత్తుపదార్థాలకు బానిసలు అవుతున్నా రంటే అందుకు కారకుడు ముమ్మాటికీ ఈ ముఖ్యమంత్రే. ఉపాధి, ఉద్యో గాలు ఇవ్వకుండా వారిని నిరాశానిస్పృహలకు గురిచేసి, యువత భవిష్య త్ ను సర్వనాశనంచేస్తున్నాడు. పెద్దఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడితే, వాటితాలూకా చిరునామా విజయవాడ అని స్పష్టంగాకనిపిస్తుంటే సదరు నగర పోలీస్ కమిషనర్ తమకు సంబంధంలేదని చెబుతున్నాడు. మరి ఎవరికి సంబంధమో ఆయనే సమాధానంచెప్పాలి. పోలీస్ కమిషనర్ తాను పోలీస్ అధికారిననే విషయం మర్చిపోతే ఎలా? కేంద్రబృందం మాదకద్రవ్యాలపై విచారించినా కూడా స్థానికపోలీసులు వారికి సహకరిస్తే నే అనే విషయం మర్చిపోయి మాట్లాడితే ఎలా?
ఆరునెలలు ఆగితే ప్రజలే పోలీసుల కాలర్ పట్టుకుంటారు. తరువాతే జగన్మోహన్ రెడ్డి కాలర్ పట్టుకుంటారు. ప్రజలను, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? రాష్ట్రాన్నికాపాడమని ప్రతిపక్షం గొంతెత్తి అరుస్తుంటే, ఆ గొంతునొక్కేయడానికి కూడా పోలీసులు పనిచేస్తున్నారు. ఎక్కడో పక్క రాష్ట్రంనుంచి రెండుమద్యం సీసాలు తెచ్చాడనిచెప్పి, యువకుడిని బెదిరించిభయపెట్టి, అతని చావుకు కారకులయ్యారు ఈ పోలీసులు. అ లాంటిపోలీసులు మాదకద్రవ్యాల ఎగుమతి, అమ్మకాలపై చిన్నపిల్లలకు చెప్పినట్లు కథలుచెబుతున్నారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ అనేది ముఖ్యమం త్రి ఇంటికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాని అడ్రస్ తో వచ్చిన మాదకద్రవ్యాల గురించి పోలీసులు తమకు సంబంధంలేదనిచెప్ప డం ఏంటి?
ఒక గూటిపక్షులన్నీ ఒకేచోటికిచేరుతాయన్నట్లుగా అవినీతి పరులు, దొంగలు, దోపిడీదారులు, మాదకద్రవ్యాల వ్యాపారులు అంతా ఒకేచోట ఉన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, తమ బిడ్డల భవిష్యత్తు నాశనమవుతోందని ఒక తల్లి వీడియోతీసి, నేరుగా ముఖ్యమంత్రినే ప్రశ్నించింది. ఈ పోలీసులు ఆ తల్లికి ఏంసమాధానం చె బుతారు? పిచ్చి మద్యాన్ని అమ్ముతున్నది కాక, దానిలో మాదకద్ర వ్యాలను కలిపి మరీ, అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి తన దోపిడీకోసం, తనధనార్జన కోసం యువతీయువకులను ఎందుకూ పనికి రాని వారిగా మార్చేసి, ఒక తరం మొత్తాన్నే సర్వనాశనం చేస్తున్నాడనే వాస్తవాన్ని ప్రతి తల్లీ తండ్రీ గమనించాలి. రాష్ట్రానికి ఉన్న 50 సంవత్సరాల భవిష్యత్ ను కూడా జగన్మోహన్ రెడ్డి, ఆయన జగబన్లు సర్వనాశనం చేస్తున్నారు. డీజీపీ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకొని, విధినిర్వహణ చేస్తే బాగుంటుంది.

Leave a Reply