అధికారం కోసం తండ్రి పేరు, తల్లీచెల్లిని వాడుకొని వదిలేసి సిగ్గులేకుండా ఇతరుల్ని నిందిస్తున్నాడు
– ఉచ్ఛనీచాలు మరిచి ప్రతిపక్షనేతలపై వ్యక్తిగతవిమర్శలు చేయడం, బూతులు తిట్టడంతప్ప ఇది చేశానని ప్రజలకు చెప్పుకోలేని దుస్థితి జగన్ ది.
• ప్రజలకోసం, ప్రజలసొమ్ముతో ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం జగన్ కే చెల్లింది.
• గతంలో ఎంతమంది కలిసినా నా వెంట్రుక పీకలేరన్నజగన్, ఇప్పుడు ఓటమిభయంతో దిగజారి మాట్లాడుతున్నాడు.
• తన చీకటిబాగోతాలు ప్రజలకు తెలియవన్నట్టు గురివిందగింజలా ఇతరుల్ని వేలెత్తి చూపుతున్నాడు.
• ఈనాడు జగన్ పక్కన ఉన్నవారే గతంలో రాజశేఖర్ రెడ్డితో “జగన్ లాంటి వాడు నీ కొడుకుగా పుట్టాల్సిన వాడు కాదు” అని అనలేదా?
• మహిళలకు కన్నీళ్లు, రైతులకు కష్టాలు, యువతకు వేదన, ఉద్యోగుల రోదన తప్ప నాలుగేళ్లపాలనలో ఏం సాధించావు జగన్?
– మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
జగన్మోహన్ రెడ్డి స్థాయిమరిచి చౌకబారుగా మాట్లాడటం, ప్రజలసొమ్ముతో ప్రజలకోసం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఉచ్ఛనీచాలు లేకుండా ప్రతిపక్షనేతలపై దిగజారుడు విమర్శలు చేయడం, అతనిలోని ఓటమిభయానికి సంకేతమని టీడీపీనేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ గతంలో ఎన్నిపార్టీలు, ఎవరు కలిసివచ్చినా నా వెంట్రుకకూడా పీకలేరన్న జగన్మోహన్ రెడ్డి, కేవలం 9 నెలల్లోనే స్వరంమార్చి, పసిపిల్లల ముందు బూతులు మాట్లాడే దుస్థితికి వచ్చాడు. మహిళలు, రైతులు, విద్యార్థులు, నేతన్నలనే తేడాలేకుండా బహి రంగసభలు, సమావేశాల్లో తానేంమాట్లాడుతున్నాననే ఇంగితంలేకుండా నోటికి పని చెబుతున్నాడు. ప్రతిసంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోతుంటే, వారిని ఆదుకోవ డానికి జగన్ ఏనాడూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
అకాలవర్షాలకు ధాన్యంతడిచి నష్టపోయిన వరిరైతుల ముఖం చూడటానికి కూడా జగన్ కు మన సొప్పలేదు. పొగాకు, మిర్చి, ఇతర వాణిజ్యపంటలు వేసిన రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోతే, వారికి రూపాయిసాయం అందించింది లేదు. ఖరీఫ్ మొదలైనా, దుక్కిదున్నివిత్తనం వేయలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, జగన్ ఏనాడూ వారి గోడు ఆలకించిందిలేదు.
తన చీకటిబాగోతాలు ప్రజలకు తెలియవన్నట్టు జగన్మోహన్ రెడ్డి గురివిందగింజలా ఇతరుల్ని విమర్శిస్తున్నాడు. తండ్రి ఆశయాల్ని తుంగలోతొక్కి, యువజన, శ్రామిక రైతుపార్టీ అనిపేరుపెట్టి, రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎలా పెడతావు జగన్?
ప్రజలకు చేసిందేమీలేక, చెప్పుకోవడానికి ఏమీలేకనే జగన్మోహన్ రెడ్డి గురివిందగింజ మాదిరి ఎదుటివారిపై విమర్శలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రజల గురించి ఆలోచించడం, పరిపాలన చేతగాదని తేలిపోయింది. అందుకే ఎవరు ఏమి అడిగినా బూతులుతప్ప మరోటి వారినోటినుంచి రావడంలేదు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ల వైపు జగన్ ఒకవేలెత్తిచూపితే, మిగిలినవేళ్లన్నీ అతనిబాగోతాల్ని ఎత్తిచూపుతున్నాయి.
తండ్రి ఆశయాలకు వెన్నుపోటుపొడిచి, యువజన శ్రామిక రైతుపార్టీ అని పార్టీకి పేరుపెట్టి, రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకోవడం ఏమిటి? తండ్రి ఆలో చనలు, ఆశయాల్ని జగన్ తుంగలోతొక్కాడు. పేరుకేమో వైఎస్సార్ పార్టీ అంటూ, ఆ వైఎస్ ఆత్మక్షోభించేలా సొంతకుటుంబాన్నే వీధినపడేశాడు.
తల్లి, చెల్లి కాలికి బలపం కట్టుకొని జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి తిరిగితే, వారిని భయభ్రాంతులకు గురిచేసి హైదరాబాద్ లో తలదాచుకునేలా చేశాడు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆగడాలు, దుశ్చర్యలు తోటిమంత్రులకు చెప్పుకొని వాపోయాడు. ఈనాడు జగన్ పక్కనఉన్నవారే ఆనాడు రాజశేఖర్ రెడ్డితో నీలాంటి వాడికడుపున జగన్ పుట్టా ల్సింది కాదని అనలేదా ? ఇలా చెప్పుకుంటూపోతే జగన్ రెడ్డి చీకటిబాగోతాలు చాలా ఉన్నాయి. అవన్నీ ప్రజలకు తెలియవనుకోవడం జగన్ మూర్ఖత్వమే.
తప్పొప్పులు సరిదిద్దుకోకుండా, ప్రతిపక్షాల విమర్శల్లోని నిజానిజాలు తెలుసుకోకుం డా బూతులుతిట్టడం, వ్యక్తిత్వహననానికి పాల్పడటమే గొప్ప అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు
16 నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తి ఏ మచ్చాలేని చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటు. చంద్రబాబు ముసలివాడు అనిహేళన చేస్తున్న జగన్, టీడీపీ అధినేతతో ఏ విషయంలో అయినా పోటీపడగలడా? అభివృద్ధిలో గానీ, సంక్షేమ పథకాల అమల్లోగానీ, ప్రజల్లోకి వెళ్లి ధైర్యంగా వారికష్టసుఖాల్లో పాలుపంచుకోవడం గానీ ఏ విషయంలో నైనా జగన్ సరితూగగలడా? ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నా లెక్కచేయకుండా ప్రజ ల్ని కలవడానికి 7కిలోమీటర్లు నడిచివెళ్లి, తాను అనుకున్నది చేశాడు.. అదీ చంద్రబాబు అంటే. 10 కిలోమీటర్లదూరం కూడా రోడ్డుపై ప్రయాణించ కుండా గాల్లో తిరిగే జగన్ కు, చంద్రబాబుకి పోలికా?
పోలీసుల్ని కాపలాపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టు కున్న జగన్మోహన్ రెడ్డి, అతని మంత్రివర్గం విమర్శలు, దూషణలకే పరిమితమైం ది. ప్రతిపక్షాలు విమర్శిస్తే, ఆ విమర్శల్లో తప్పొప్పులు ఏమున్నాయి..మనం ఏం సరిదిద్దుకోవాలనే ఆలోచన చేయకుండా, నోరుందని బూతులు వల్లెవేస్తే ప్రజలు ఏదోఒక రోజు మీ మూటముల్లే సర్ది బంగాళాఖాతంలో విసిరేస్తారు. వ్యక్తిగత విమర్శలతో ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని, స్థాయిని కించపరచడం తప్ప, ప్రజలకు ఇదిచేశానని చెప్పుకోలేని దుస్థితిలో జగన్ అతని మంత్రులు ఉన్నారు.
రాష్ట్ర సంపద మొత్తాన్ని ఏకీకృతంచేసిన జగన్, అతని మంత్రులు, వైసీపీనేతలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజలు ఎక్కడ తమఅవినీతి, దోపిడీని నిలదీస్తారోనన్న భయంతో వారిముఖం చూడటానికి భయపడుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యి నాలుగున్నేరుళ్లు అయ్యింది…సిగ్గు లేకుం డా ఇంకా దుష్ప్రచారం చేయడం బూతులతిట్టడమే నమ్ముకున్నావు.
జగన్ కు నిజంగా దమ్ము, ధైర్యముంటే తానుఇదిచేశానని ప్రజలకు చెప్పుకొని, వారిముందు కెళ్లి ఓట్లు అడగాలి. ఎన్నికలకు వెళ్లడానికి జగన్ ఎంత తహతహ లాడుతున్నాడో, ఈ సైకోముఖ్యమంత్రిని, అసమర్థప్రభుత్వాన్ని ఎప్పుడు గోతిలో కప్పెడదామా అని ప్రజలు అంతకం టే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.” అని కన్నా స్పష్టంచేశారు.