– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్
విద్యార్థి దశలోనే నేటి యువతకు ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను, ఆనందమయ జీవితానికి కావలసిన లక్షణాలను, ప్రాణాపాయ దశలో ఉన్న రోగులకు సిపిఆర్ లాంటి ప్రథమ చికిత్స పద్దతులను పాఠ్యాంశంగా తీసుకొని నేర్పించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షులు లయన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
మంగళవారం కరీంనగర్ లో రెనీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, శాతవాహన లయన్స్ క్లబ్ సంయుక్తంగా రెనీ ఆసుపత్రి సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన సిపిఆర్ లేదా గుండె ఊపిరితిత్తుల పునరుజ్జీవన శిక్షణాశిబిరాన్ని ప్రారంభించి వినోద్ కుమార్ మాట్లాడుతూ సిపిఆర్ ప్రథమ చికిత్స విధానాన్ని అందరు తెలుసుకొని ఉండాలని, ముఖ్యంగా కళాశాలల యువతకు ఈ శిక్షణను తప్పనిసరిగా ఇవ్వాలని, ఈ సత్కార్యాన్ని శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభిద్దామని అన్నారు.
గత ఆరు దశాబ్దాలుగా నేత్ర చికిత్సను పేదలకు చేరువ చేసిన పేరు లయన్స్ సంస్థకు ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శాతవాహన లయన్స్ క్లబ్బులో సభ్యత్వం తీసుకున్న లయన్ వినోద్ కుమార్‌కు లయన్ పిన్నును ప్రదానం చేసి సంస్థలోకి ఆహావానించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన రెండవ ఉప గవర్నర్ లయన్ లింగరాజు కోదండరామ్ మాట్లాడుతూ సిపిఆర్ శిక్షణ లేత వయస్సు యువతకు ఇవ్వడం వల్ల మేలు ఎక్కువగా కలుగుతుందని, లయన్స్ సంస్థ ద్వారా అవసరార్థులకు ఉచిత సేవలను నిరంతరం చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమ చైర్మన్ లయన్ డా: బంగారి స్వామి మాట్లాడుతూ సిపిఆర్ శిక్షణను సెలబస్‌లో చేర్చడం వల్ల అనేక ప్రాణాలు నిలబడతాయని అభ్యర్థించారు. కమ రెనీ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత ఆపరేషన్లు, చమకైన మల్టీస్పెషాలిటీ వైద్య సేవలను నైపుణ్యం కలిగిన వైద్యుల సహకారంతో అందిస్తున్నామని అన్నారు. లయన్స్ క్వబ్బు సభ్యులకు ఉచిత ఓపి సేవలు, ప్రత్యేక వైద్య సహకారం అందిస్తామని వివరించారు.
సభాధ్యక్షత వహించిన లయన్ యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సిపీఆర్ శిక్షణను ఇవ్వడానికి తమ క్లబ్ ముందుంటుందనా హామీ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డా: దీక్షిత్ నేతృత్వంలో సిపిఆర్ శిక్షణను వివరించి, ప్రదర్శించి, ప్రతి ఒక్క లయన్ సభ్యుడు, విద్యార్థినీవిద్యార్థులచేత చేసింది తగు సూచనలు చేశారు.
కార్యక్రమ సమన్వయకర్తగా లయన్ కెప్టెన్ డా బుర్ర మధుసూదన్ రెడ్డి వ్యవహరించగా, డా: రజనీ ప్రియదర్శిని, ఉపాధ్యక్షులు లయన్ మేకల అరవింద్ బాబు, డిసిఎస్ లయన్ రమణారెడ్డి, ఆర్‌సిలు లయన్ జి లక్ష్మయ్య, లయన్ పెద్ది విద్యాసాగర్, లయన్ గట్టు రాజయ్య, జెడ్‌సిలు లయన్ సంపత్ కుమారీ, లయన్ సీతారాం రెడ్డి, శాతవాహన క్లబ్ కార్యదర్శి లయన్ డా ఏ లక్ష్మారెడ్డి, కోశాధికారి లయన్ కోట సత్యం, వివిధ లయన్స్ క్లబ్బుల నాయకులు, లియో సభ్యులు పాల్గొని సిపీఆర్ శిక్షణ పొంది దృవపత్రాలు స్వీకరించారు.