Suryaa.co.in

Andhra Pradesh

ఆరోగ్యకర జీవనం.. యోగాతో సౌభాగ్యం

– నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు
– రంగన్న గూడెం లో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

బాపులపాడు: కృష్ణాజిల్లా, బాపుల పాడు మండలం, రంగన్నగూడెం గ్రామంలోని కమ్యూనిటీ హాలులో ఉదయం గ్రామస్థులు, విద్యార్థినీ విద్యార్థులు, రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులతో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా ట్రైనర్ సి.హెచ్. తేజస్విని విద్యార్థినీ విద్యార్థులకు, గ్రామస్తులకు వివిధ యోగాసనాలు వేయించటం ద్వారా యోగా ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ యోగా సాధన వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధ్యమౌతుందని, యోగాను విద్యార్థులు చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలని ఇది మన దైనందిన జీవితంలో భాగమై వ్యసనంగా మారాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE