అమరావతి: ద్రోణి ప్రభావంతో రానున్న 2రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.
ప్రకాశం,నెల్లూరు,నంద్యాల,కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి, కడప,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి- మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉందన్నారు.
రేపు విజయనగరం, పార్వతీ పురంమన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40- 41°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.