Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం

– వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.జూపూడి ప్రభాకర్‌రావు

అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియా గ్రూప్‌ గొంతు నొక్కాలన్న కుట్ర రాష్ట్రంలో జరుగుతోంది. అందులో భాగంగానే రెండు రోజులుగా సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా పత్రికా కార్యాలయాన్నే తగలబెట్టడం అత్యంత హేయం.

ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై పెట్రోల్‌ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసిన పచ్చమూకలు, ఆఫీసులో ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులోని సోఫా సెట్లు, ఫర్నిచర్‌ అగ్నికి ఆహుతి అయ్యాయి. అక్కడే ఉన్న భవనం యజమాని కారు కూడా పాక్షికంగా «ధ్వంసమైంది.

ప్రభుత్వ పెద్దలు ఒక వ్యూహం ప్రకారం లేని వివాదాన్ని సృష్టించడంతో పాటు, అక్రమ కేసులు బనాయించి సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించారు. మరోవైపు దాడులు చేస్తూ, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.

LEAVE A RESPONSE