– వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు.ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు పాల్పడుతున్నారు.
ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు.
పత్రికా స్వేచ్ఛపై దాడి: మాజీ మంత్రి మేరుగ నాగార్జున
ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టడం అత్యంత దారుణం, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి. సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు. సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి ప్రమాదకరం
విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించినప్పటికీ అరెస్ట్ చేయడం, 70 ఏళ్ల కొమ్మినేనిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం అత్యంత దారుణం. దేశవ్యాప్తంగా ఇలాంటి టాక్ షోలు చేసే వారు అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.. కొమ్మినేనిపై పెట్టినట్టు వారందరిపైనా అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతారా?