ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ భారీ లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని / వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని తెలిపారు. అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్ద గొల్లపాలెం వరకు అతివేగంతో అలలు వస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారులు సూచించారు.
తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.