– నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థికి లాప్టాప్ అందజేసిన “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్”
రామచంద్రపురం : నిరుపేద కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థికి “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్” చైర్మన్ వాసంశెట్టి సత్యం సోమవారం లాప్టాప్ ను ఉచితంగా అందజేశారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే నిరుద్యోగులకు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇటీవల పలువురు నిరుపేద విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా లాప్ టాప్ లు అందజేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ , తమ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రామచంద్రపురంకు చెందిన నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థి దొమ్మలపాటి అభిషేక్ ప్రీతమ్ కు రూ. 90 వేలు విలువచేసే లాప్టాప్ ను ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ఉచితంగా అందజేశారు.
పేదరికంలో ఉన్న విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు లాప్టాప్ చాలా అవసరమని, ఆర్థిక స్తోమత లేని నిరుపేద విద్యార్థులకు సహాయం చేయడంలో చాలా ఆత్మ సంతృప్తి ఉందన్నారు. చదువును మించిన ఆస్తి మరొకటి లేదని, ప్రతి ఒక్కరు చదువుకుని ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.