– మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు
17 సెప్టెంబర్ ను హైదరాబాదు విమోచన దినంగా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం చరిత్రాత్మకం. విమోచన ఉత్సవాలు ఆనాటి హైదరాబాదు సంస్థానంలో భాగాలుగా ఉన్న ప్రాంతాలలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా 17 సెప్టెంబర్ నాడు విమోచన దినంగా ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఇంతవరకు తెలంగాణాలో అధికారికంగా విమోచన ఉత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించక పోవడం విచారకరం.
భారతదేశానికి స్వాతంత్రం వఛ్చిన తరువాత, పదమూడు మాసాల రెండు రోజులకు సర్దార్ వల్లాభాయ్ పటేల్ నేతృత్వంలో ఈ ప్రాంతానికి విమోచన లభించింది. ఇన్ని రోజులకు అభినవ సర్దార్ వల్లాభాయ్ పటేల్ అమిత్ షా నేతృత్వంలో ఆ రోజును అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం నోటిఫికేషన్ జారీ చేయడం చరిత్రాత్మకం.