Suryaa.co.in

Andhra Pradesh

హోంమంత్రి అనితకు శుభాకాంక్షల వెల్లువ

-సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యమయిన నియోజకవర్గ యువత
– ఘనంగా హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు
– మెగా రక్తదాన,వైద్య శిభిరం ద్వారా 300 మంది రక్తదానం
– పేదలకు దుస్తులు , క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతుల పంపిణీ
– నక్కపల్లి హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో పండగ వాతావరణం
-ఎస్.రాయవరం రేవుపోలవరం తీరంలో ఆకర్షణగా హోంమంత్రి అనిత సైకత శిల్పం

నక్కపల్లి, అనకాపల్లి: హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లిలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎస్.రాయవరం రేవుపోలవరం తీరంలో ఆకర్షణగా తీర్చిదిద్దిన సైకత శిల్పం వద్ద ఆమె జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని సోదరుడు అడివిరాజు నేతృత్వంలో మత్స్యకార కుటుంబసభ్యుల మధ్య హోంమంత్రి కేక్ కట్ చేశారు.

ఉదయాన్నే ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి హోంమంత్రి అనిత వేదపండితుల ఆవీర్వచనం పొందారు. నియోజకవర్గం, జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు,కార్యకర్తలు హోంమంత్రి అనిత అభిమానులు కేక్ లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కూటమి నేతలు, నియోజకవర్గ, జిల్లా స్థాయి అధికారులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా జన్మదిన వేడుకల్లో పాల్గొని మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో నక్కపల్లి మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

హోంమంత్రికి అనితకు శుభాకాంక్షల వెల్లువ

హోంమంత్రి అనితకు రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువగా మారింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా కేబినెట్ సహచర మంత్రులు ఆమెకు ఫోన్ చేసి, సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం శాసనసభ్యులు అతిథి గజపతి స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన హోంమంత్రి అనితకు ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా హోమంత్రి క్యాంప్ ఆఫీస్ వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ నేతృత్వంలోని పోలీసుల బృందం స్వయంగా కలిసి విషెష్ తెలిపారు. శాసనసభ్యులు, విశాఖపట్నం, అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీలు సైతం హోంమంత్రిని ఫోన్ చేసి విషెస్ తెలిపారు.

హోంమంత్రి అనిత పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని యువకులు పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ఐ టిడిపి,టిఎన్ ఎస్ ఎఫ్,తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేసారు. పెద్దఎత్తున యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
అపోలో ఆసుపత్రి ఆద్వర్యంలో ఉచితవైద్య శిభిరం నిర్వహించగా 300 మంది రక్తదానం చేశారు. పేదలకు మంత్రి అనిత దుస్తులు పంపిణీ చేశారు. ఇటీవల వారంరోజులపాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు హోంమంత్రి నగదు బహుమతులు అందజేసి, క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.

LEAVE A RESPONSE