Suryaa.co.in

Crime News Telangana

వేట కత్తితో దళిత యువకుడిపై హోమ్ గార్డ్ దాడి

బాలసముద్రంలోని అంబెడ్కర్ నగర్ లో నివసిస్తు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోం గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న శాంతపురి చంద్రమోగిలి మద్యం సేవించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. శనివారం ఉదయం కూడా మద్యం సేవించి ఉన్న ఆ హోమ్ గార్డ్ తన ద్విచక్ర వాహనం లో వేట కత్తి పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తన దగ్గర ఉన్న వేట కత్తితో దళిత యువకుడు చింతం వినయ్ (బన్నీ) , గణేష్ అనే యువకులపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. కాలనీ వాసులు అందరూ ఆపే ప్రయత్నం చేసినా వేట కత్తితో విరుచుకుపడ్డాడు. ప్రాణ భయంతో అక్కడి నుండి యువకులు పారిపోయారు. అనంతరం 100 కు ఫోన్ చేసిన పోలీసులు పాటించుకోలేదు అని యువకులు తెలిపారు. వేట కత్తి పట్టుకొని దాడి చేసేటప్పుడు ఆ హోమ్ గార్డ్ ఫోటో లు తీసిన ఈ ఇద్దరి యువకులపై నే కేస్ నమోదు చేశారు అని బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు.

LEAVE A RESPONSE