మునుగోడులో మంత్రి గంగుల కమలాకర్ ప్రచారానికి విశేష స్పందన

Spread the love

మునుగోడు లో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సంస్థాన్ నారాయణ పురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రభుత్వం పేదలకు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి మంత్రి వివరిస్తుంటే వారి నుండి విశేష స్పందన లభించింది. తమను కడుపులో పెట్టి చూసుకుంటున్న కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని మునుగోడు ప్రజానీకం జై జైలు పలుకుతున్నారు. సంస్థాన్ నారాయణపురం పరిధిలో ప్రతి ఓటు టిఆర్ఎస్కే పడుతుందని అక్కడి నేతలు కార్యకర్తలు దీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీతో పాటు టిఆర్ఎస్ కార్యకర్తలు, సంస్థాన్ నారాయణపురం ప్రజలు కరీంనగర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply