హుజూరాబాద్ లో జరిగే ఉపఎన్నికను బీజేపీ-టీఆర్‌ఎస్ మద్యజరిగేదిగా చూడొద్దు .
ఈ పోరాటం ఇద్దరు తెలంగాణా నేతల మధ్య జరిగే యుద్ధంగానే చూడాలి .
కేసీఆర్ అధికార బలంతో అత్యంత బలోపేతుడిగా ఉన్నారు , ఆయన్ని డీకొనే సమర్ధుడు శక్తివంతుడు కేవలం ఈటెల మాత్రమే. పోటీలో ఎవడో ఒక తెలంగాణా ఉద్యమద్రోహి ఉంటే ఆలోచించాలి. కానీ ఇక్కడ ఈటెల ఉద్యమ సేనానుల్లో ఒకరు . ఈటెలను ఓడించటానికి కేసీఆర్ , సర్వశక్తుల్ని ఒడ్డి గోదాలోనికి దిగడమంటే ..ఈటెల నైతికంగా విజయం సాధించినట్లు లెక్క .
వేల కోట్ల విలువైన వాగ్దానాలు , మోహరించిన మంత్రులు , MLA లు MP లు , వివిధ కార్పొరేషన్ చైర్మన్లు , కులసంఘాలను కొనుక్కోవటం , పోలీసు వ్యవస్థను వాడుకోవడం.
డబ్బులు , రకరకాల కానుకలు పంచటం వంటి , అధికార దుర్వినియోగం కేసీఆర్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇన్నిరకాల మాయోపాయాలతో ……తోటి ఉద్యమనేత ఈటెలని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తూనే, మరోపక్క ఈటెల ప్రతిష్ట దిగజార్చటం కోసం.. ఎన్నెన్నో అసత్యప్రచారాలు కూడా టీఆర్‌ఎస్ చేయటం విషాదకరం.
అయినా ప్రజలు ఈటెల పక్షానే ఉన్న సత్యం గుర్తించాలి. ఈటెల ఘనవిజయం సాధించాలని ప్రతి తెలంగాణావాది, మనస్సు పూర్వకంగా కోరుకుంటున్నారు .ఈటెల సింహంలా ఎన్నికల వేట క్రీడలో గెలిచితీరుతారు. ఈటెల గెలుస్తేనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయి . కేసీఆర్ తనచుట్టూ నిర్మించుకున్న ఇనుప గోడలనుండి, బయటకు వచ్చితీరుతారు అందుకే ఈటెల గెలవడం ……చారిత్రక అవసరం!
కేసీఆర్ పద్ధతుల్లో గుణాత్మకమైన మార్పు రావటం కోసమైనా ఈటెల గెలవాలి. ఎన్నికలకు ఇంకా 2 ఏండ్ల గడువుంది. ఈటెల గెలిచినా కేసీఆర్ప్ర భుత్వానికి ఢోకా లేదు , కానీ కేసీఆర్ ఆకాశాన్నుండి మళ్లీ భూమి మీదకు వచ్చి, ప్రజల సమస్యలు తెలుసుకుంటారనే ఆశ నాకు ఉంది. రాష్ట్రం నిజమైన అభివృద్ధిపథం లో అడుగు పెట్టాలంటే ….. ఈటెల విజయం సాదించటం, అనివార్యంగా హుజూరాబాద్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి ఈటల రాజేందర్ ని గెలిపించాలి.