-తెలంగాణలో ఏర్పాటు కానున్న మొబిలిటీ క్లస్టర్
-క్లస్టర్‌లో పెట్టుబడి పెట్టనున్న హ్యుందాయ్
-దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల నేపథ్యంలో మంత్రి కే తారకరామారావుతో సమావేశమైన హ్యుండై గ్రూప్ ఈరోజు తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కే తారకరామారావుతో దావోస్ లోని తెలంగాణ పెవీలియన్ లో హ్యుండై సిఐఓ యంగ్చో చి (CIO Mr. YoungCho Chi) సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్ లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్ లతో పాటు ఇకో సిస్టమ్ అవసరం అయిన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాల పైన కూడా విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుండై పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుండై కి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో 1400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హ్యుండై కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హ్యుండాయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.
The announcement was made after Minister @KTRTRS‘s meeting with Hyundai’s President & CIO Mr. YoungCho Chi at @wef in Davos. IT Dept. Principal Secretary @jayesh_ranjan & @CRO_Telangana @amaratmakuri were present in the meeting. #TelanganaAtDavos #InvestTelangana
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2022