Suryaa.co.in

Andhra Pradesh

బాంబులకే భయపడని వ్యక్తిని నేను.. వీళ్లకు భయపడతానా?

– జగన్ ఒక రివర్స్ మనిషి
– జగన్ నేరుగా చూసి కూడా మాట్లాడడు
– సీమలో 102 ప్రాజెక్టులు, అనంతపురంలో 32 ప్రాజెక్టులు రద్దు చేసిన రాయలసీమ ద్రోహి ఈ జగన్
– పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారా?
– బ్రాందీ షాపులో బిల్లు ఇస్తున్నాడా…ఎందుకు ఇవ్వడంలేదో మీరు అడిగారా?
– అసమర్థత వల్ల రూ. 200 బిల్లు రూ.1000 అయ్యింది
– రూ.2 వేల బిల్లు రూ. 5 వేలు అయ్యింది
– ప్రతి ఇంటిపై ఏడాదికి 8 వేల నుంచి 50 వేల భారం
– మంత్రి సుజలానుకు చెందిన 160 ఎకరాలు కొట్టేసింది. ఎకరా లక్షకు కొట్టేశారు
-కళ్యాణదుర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే… రాష్ట్రం కోసం నేను దేన్నీ లెక్క చేయను. రాష్ట్రం కోసం పోరాటం చేస్తా. బాంబులకే భయపడని వ్యక్తిని నేను. వీళ్లకు భయపడతానా? ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఏం చేశాడో జగన్ చెప్పాలి. ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి.కళ్యాణ దుర్గంలో 114 చెరువులకు నీరు ఇచ్చే భైరవానితిప్ప ప్రాజెక్టును నాశనం చేసిన జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలి
నాడు ఇరిగేషన్ లో 12 వేల కోట్లు రాయలసీమకు ఖర్చు పెట్టాను…జగన్ కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు. జగన్ ఒక రివర్స్ మనిషి…..రివర్స్ టెండర్లతో ఇరిగేషన్ ను నాశనం చేశాడు.

జగన్ నేరుగా చూసి కూడా మాట్లాడడు. 365 జీవో తెచ్చిన జగన్ రాష్ట్రంలో 192 ప్రాజెక్టులు రద్దు చేశాడు. సీమలో 102 ప్రాజెక్టులు, అనంతపురంలో 32 ప్రాజెక్టులు రద్దు చేసిన రాయలసీమ ద్రోహి ఈ జగన్ అనంతపురం జిల్లాకు న్యాయం చేసిన మహానాయకుడు అన్న ఎన్టీఆర్.

హంద్రీ నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్. దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంది నేను. గొల్లపల్లి ప్రాజెక్టును సవాల్ గా తీసుకున్నా….కియా మోటార్స్ తీసుకువచ్చాను. 20 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయి. కియా పరిశ్రమను చూస్తే అనంతపురంలో ఉన్నామా…అమెరికాలో ఉన్నామా అనే అభిప్రాయం వస్తుంది.

ఈ ప్రాంతంలో ఇప్పుడే ఒక రైతు చెప్పాడు. 100 ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చామని చెప్పాడు. మనం వచ్చి ఉంటే ప్రతి రైతుకు డ్రిప్ సబ్సిడీ ఇచ్చే వాళ్లం. టీడీపీ అధికారంలో వచ్చి ఉంటే ఇప్పటికే ప్రతి ఎకరాకు నీరు వచ్చేది.

నాడు హంద్రీనీవా కాలువలను వెడల్పు చేయాలని 35 శాతం పనులు చేశాను. వీళ్లు దాన్ని నాశనం చేశారు. ఈ ఏడాది వర్షాభావం కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం చేశారా? పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.

తెలుగు దేశం పార్టీ కి కంచుకోట అనంతపురం జిల్లా. బిసిల పార్టీ తెలుగుదేశం పార్టీ. నేడు ఈ ప్రభుత్వంలో ఏ బిసికి అయినా న్యాయం జరిగిందా…జగన్ నా బిసిలు నాబిసిలు అని నాటకాలు ఆడుతున్నాడు జగన్ వచ్చాడు మద్దులు పెట్టాడు…నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. జగన్ కు ఇచ్చిన ఒక్క చాన్స్ ఇక ఆఖరి చాన్స్ కావాలి.

ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా….5 ఏళ్లలో మాకు ఆదాయం పెరిగింది అని ఒక్కరైనా చెప్పగలరా.? ఈ ప్రభుత్వం బాగా చేసింది అంటే నేను ఇక మాట్లాడను. రైతులు, కూలీలు, మహిళలు బాగున్నారా…..ఒక దద్దమ్మ మంత్రి మాట్లాడుతూ గురువు కంటే గూగుల్ గొప్ప అంటున్నాడు. ఈ దద్దమ్మకు ఏం తెలుసు ? చదువు చెప్పేది చెప్పబోయేది గురువు. గూగుల్ కాదు. గురువులపై ఇంతటి అహంకారం క్షమించకూడదు. ఇలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పి రాజకీయ సమాధి చేయాలి.

తెలుగుదేశంలో ఉన్న బిసి నేతలపై అక్రమ కేసులు పెట్టారు. 26 వేల మంది బిసిలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 34 శాతం రిజర్వేషన్ల ను 24 శాతం చేశాడు. నాడు ఆదరణ ద్వారా ఆదునిక పనిముట్లు ఇచ్చాను. వాటిని కూడా ఈ సైకో పంపిణీ చేయలేదు. నాడు టిటిడి బోర్డు చైర్మన్ పదవి, యూనివర్సిటీ విసిలుగా బిసిలను నియమించిన పార్టీ తెలుగుదేశం దళితులను మోసం చేసిన పార్టీ వైసీపీ….27 దళిత పథకాలను తీసివేసిన పార్టీ ఈ దుర్మార్గపు పార్టీ.

తూర్పు గోదావరిలో ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారు. యువతను అడుగుతున్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా…..నాడు 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఒప్పందాలు చేశాం. 5.20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.జగన్ ఎక్క డిఎస్సి పెట్టలేదు…ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.

కేంద్రం ఇచ్చే నరేగా పనుల్లో కూడా కోత పెట్టాడు ఈ సిఎం ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క సిమెంట్ రోడ్డు వేశారా? నరేగాలో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. నేడు మీ ఊళ్లో ఇసుక మీకు దొరకడం లేదు…కానీ పక్క రాష్ట్రలకు తరలించి అమ్ముకుంటున్నారు.

రాష్ట్రంలో ఇసుక దొంగలు ఎవరు అంటే వైసీపీ నేతలే. ఇసుకలో రూ.40 వేల కోట్లు దోచుకున్న ఇసుకాసురుడు ఈ సైకో జగన్మద్యపాన నిషేదం చేస్తాను అన్న జగన్ ఇప్పుడు ఏం చేశాడు?
మద్య నిషేదం చేయకపోతే ఓట్లు అడగను అన్నాడు. 60 రూపాయల క్వార్టర్ బాటిల్ 200 అయ్యింది.

ఎపిలో ఉండే బ్రాండ్లు మరెక్కడా ఉండవు. ఇవన్నీ వైసీపీ సొంత బ్రాండ్లు బ్రాంది షాపులో బిల్లు ఇస్తున్నాడా…ఎందుకు ఇవ్వడంలేదో మీరు అడిగారా? తోపుడు బండిలో కూడా ఫోన్ పే చేయవచ్చు…కానీ మద్యం షాపుల్లో తీసుకోరు.

మీ రక్తం తాగే జలగ ఈ సైకో. పెట్రోల్ డీజిల్ దేశంలో ఎక్కువ రేట్లు ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం. నిత్యావసర వస్తువులు రెండు వందలు, నూనె ధరలుపెరిగాయి. కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచారు. కరెంట్ చార్జీలు 8 సార్లుపెంచారు. నాడు మన హయాంలో కరెంట్ చార్జీలు పెంచలేదు.

ఈ జగన్ అవినీతి వల్ల అసమర్థత వల్ల రూ. 200 బిల్లు రూ.1000 అయ్యింది. రూ.2 వేల బిల్లు రూ. 5 వేలు అయ్యింది. ప్రతి ఇంటిపై ఏడాదికి 8 వేల నుంచి 50 వేల భారం పడుతుంది. కరెంట్ చార్జీలు లేని చోటు లేదు…కరెంట్ బిల్లులపై తిట్టని నోరు లేదు. ఈ రెండూ జరగని గ్రామమే లేదు. తెలిసిందా జగన్. ఈ సైకో జగన్ పోతేనే కరెంట్ చార్జీలు తగ్గుతాయి. కరెంట్ విషయంలో సంస్కరణలు తెచ్చింది నేను. మళ్లీ సోలార్, విండ్ ఎనర్జీ తెచ్చి కరెంట్ చార్జీలు తగ్గించే బాధ్యత నాది.

జగన్ కు భయం పట్టుకుంది అందుకే యువగళంపై పడ్డాడు. పుంగనూరులో నాపై హత్యాయత్నం చేసి నా పైనే కేసులు పెట్టాడు. నేను భయపడాలా? నా పై కేసులు అని బెదిరిస్తున్నారు…ఏం టయ్యా మీరు పెట్టేది కేసులు….నిప్పులాగా ఉన్నాను. రాజశేఖర్ రెడ్డి 26 కేసులు పెట్టారు. అవినీతి పార్టీ వైసీపీ, నీతి వంతమైన పార్టీ తెలుగు దేశం పార్టీ. బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కింద సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాను మీ పిల్లలకు బంగారు భవిష్యత్ కల్పించే బాధ్యత నాది.

కళ్యాణ దుర్గంలో ఉన్న మంత్రి సుజలానుకు చెందిన 160 ఎకరాలు కొట్టేసింది. ఎకరా లక్షకు కొట్టేశారు. నేను లక్ష ఇస్తా…..ఆ రేటుకు 160 ఎకరాలు ఇస్తారా? మీరు లక్షే ఇస్తే…కొని పేదలకు ఇస్తా. ఇక్కడ ఉన్న సుబేదార్ చెరువును కబ్జా చేస్తే మీ ఇంచార్జ్ కోర్టుకు పోయి స్టే తీసుకు వచ్చాడు.

హగిరి, పెన్నా నదుల్లో ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా లే అవుట్ వేస్తే ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి. పేదలకు ఇళ్లు ఇస్తాము అని ఎకరా 6 లక్షలకు కొని ప్రభుత్వానికి 25 లక్షలకు అమ్మారు. ఇలాంటి వారికి ఓట్లు వేస్తారా…అంగన్ వాడీ పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి ఎమ్మెల్యేలు వచ్చారు. నియోజకవర్గంలో హంద్రీ నీవా ద్వారా 114 చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.ఇక్కడ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టిస్తాం.

LEAVE A RESPONSE