– సుపరిపాలనలో తొలి అడుగు
ఏడాది క్రితం ఇదే రోజు..
ఉవ్వెత్తున ఎగసిన భావోద్వేగం
“నారా చంద్రబాబు నాయుడు అనే నేను”
కార్యకర్త కళ్లలో ధారాపాతమైన భావోద్వేగం
గతేదాడి.. ఇదే రోజు.. ఉద్వేగం.. సంతోషం.. సంబరం..
వేదికపై “నారా చంద్రబాబు నాయుడు అనే నేను” మాట…
వేదికకు దూరంగా నిలబడి చూస్తున్న కార్యకర్త..
ఆ కంట నీరు.. ధారాపాత మై ప్రవహిస్తోంది…
అది బాధ కాదు.. ఎండనక, వాననక పసుపు జెండాను భుజానికెత్తుకుని ఉరికిన ప్రాణం అది..
ప్రాణం పోయినా సరే వెనకడుగు వేయని ధైర్యం.. తొడలు గొట్టి బరిలోకి ఉరికిన పౌరుషం..
ఆ క్షణాలు మళ్లీ కళ్లముందు ఒక్కసారిగా.. రక్తం చిందించిన కార్యకర్తలకు నివాళిగా..
రాష్ట్రం సుపరిపాలలో తొలి అడుగులు వేస్తూ.. సంక్షేమం.. సంబరం..
మళ్లీ మళ్లీ తలచుకుంటూ.. పసుపు రక్తం నరనరాల్లో పరుగులు పెడుతోంది..
కాంక్షిస్తోంది.. రాష్ట్రం సుభిక్షం కావాలని..
(కిరణ్)