Suryaa.co.in

Andhra Pradesh

ఈ జగన్‌ నాకు పరిచయం లేదు

-జగన్‌ పులివెందుల పులిబిడ్డ కాదు..పిల్లి
-మేం వస్తున్నామని లైట్లు తీశారట
-అంటే ముఖ్యమంత్రి ఫెయిల్‌ అయినట్లేనా
-అవినాష్‌రెడ్డికి భయం పట్టుకుందా…
-కొంగు చాచి అడుగుతున్నా…మాకు మీరే న్యాయం చేయాలి
-సీఎం అయ్యాక ఆయన ప్రవర్తన మారింది
-అధికారం అండగా హత్యా రాజకీయాలు
-ప్రజలు నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా?
-సొంత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఎందుకు?
-ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
-అవినాష్‌ హత్య చేశాడని ప్రజలు నమ్ముతున్నారు
-ఆయన ఓడిపోతాడని సీటును మారుస్తారట
-పులివెందుల బహిరంగసభలో షర్మిలారెడ్డి
-తోడుగా పాల్గొన్న వివేకా కుమార్తె సునీత

కొంగు చాచి అడుగుతున్నా…మీ ఆడ బిడ్డలం..అడుగుతున్నాం…మాకు మీరే న్యాయం చేయాలని పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. వైఎస్సార్‌ బిడ్డ కావాలో, వివేకా హత్య నిందితుడు అవినాష్‌ కావాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. మేము వస్తున్నామని తెలిసి లైట్లు తీశారట..అంటే ముఖ్యమంత్రిగా జగన్‌ ఫెయిల్‌ అయినట్లేనా…కావాలని తీశారు అంటే అవినాష్‌రెడ్డికి భయం పట్టుకున్నట్లేనా అని ప్రశ్నించారు. వివేకా హత్య విషయంలో న్యాయం జర గడం లేదని సునీతమ్మ ఎంతో బాధపడిరదని వ్యాఖ్యానించారు.

ఈ ముఖ్యమంత్రి నాకు తెలియదు
నేను జగన్‌ అన్న కోసం 3200 కి.మీ పాదయాత్ర చేశా..ఆయన సంక్షేమ పాలన వస్తుంది అనుకున్నా.. పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి.. వైఎస్‌ఆర్‌ పథకాలు అన్నీ అమలు అవుతాయనుకున్నా…జగన్‌ అన్న ఏది చెబితే అది చేశా…నేను ఒకప్పుడు చెల్లి కాదు బిడ్డను. ముఖ్యమంత్రి అయ్యా క జగన్‌ మొత్తం మారిపోయాడు. ఈ మారిన జగన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు..ఈ జగన్‌ నాకు పరిచయం లేదని వ్యాఖ్యలు చేశారు.

సొంత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఎందుకు?
వివేకా హత్య విషయంలో సునీత,చిన్నమ్మ బాగా నష్టపోయారు. సొంత రక్త సంబంధానికి న్యాయం చేయక పోతే మనం ఎందుకు? వైఎస్‌ వివేకా ఇక్కడే ఉంటారు. ఆయన గడప తొక్కని కుటుంబం ఈ పులివెందులలో లేనే లేదు. ఎంతటి పెద్ద సమస్య అయినా పరిష్కారం చేసే వాడు. తన కార్లో తీసుకొని మరి అధికారుల దగ్గరకు వెళ్లే వాడు. ఇలాంటి నాయకుడిని దారుణంగా హత్య చేశారు. జగన్‌ తన అధికారాన్ని అడ్డంగా పెట్టి మరీ హంతకులను కాపాడుతున్నారు. సీబీఐ ఆధారాలు ఉన్నాయి. ఫోన్‌ కాల్స్‌, గూగుల్‌ రికార్డ్స్‌ ఉన్నాయని చెప్పింది. హత్యకు ముందు డబ్బుల పంపిణీ కూడా జరిగింది. కానీ అవినాష్‌రెడ్డి వెంట్రుక కూడా పీకలేకపోయింది.

నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా?
జగన్‌ పులివెందుల పులి కాదు..పిల్లి. బీజేపీకి జగన్‌ బానిస అయ్యాడు. అధికారం ఇస్తే వైఎస్‌ఆర్‌ ఆశయాలను కొనసాగిస్తానని చెప్పాడు. ఆరు నెలల్లో పెండిరగ్‌ ప్రాజక్టులు పూర్తి చేస్తా అన్నాడు. 42 పెండిరగ్‌ ప్రాజెక్టులు ఉంటే…పట్టుమని 10 పూర్తి చేయలేకపోయాడు. కనీసం ఒక రాజధాని కూడా కట్టలేక పోయాడు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కోటలో నిద్ర పోయాడు. ఇప్పుడు కుంభకర్ణుడు లెక్క నిద్ర లేచి డీఎస్సీ అంటూ హడావిడి చేస్తున్నాడు. మద్య నిషేధం అని చెప్పి మోసం చేశారు. అడ్డగోలుగా నాసి రకం మద్యం అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.

అధికారం అడ్డుపెట్టుకుని హత్యా రాజకీయాలా?
అధికారం అడ్డుపెట్టుకుని హత్యా రాజకీయాలకు అండగా ఉన్నాడు. ఐదేళ్లు హంతకులను కాపాడాడు. మళ్లీ నిందితులకు సీట్‌ ఇచ్చారు. ఇది అన్యాయం. వివేకా హత్య కుటుంబ విషయమా? ఇది ఆస్తి సమస్యనా? ఇది ప్రజా నాయకుడి హత్య. న్యాయం అడగడం మేము చేసినా తప్పా? ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది. కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండి. వైఎస్‌ఆర్‌ బిడ్డ కావాలా…వివేకా హత్య హంతకుడు అవినాష్‌ రెడ్డి కావాలా ప్రజలు తేల్చుకోవాలి.

ఓడిపోతాడని అవినాష్‌రెడ్డిని మారుస్తున్నారట…
వైఎస్‌ఆర్‌ బిడ్డ ఎవ్వరికీ భయపడేది కాదు. అన్యాయాన్ని సహించేది కాదు. హంతకుడు చట్టసభల్లో వెళ్లొద్దని ఈ నిర్ణయం తీసుకున్నా. నాలుగు రోజుల పర్యటనకే అవినాష్‌ రెడ్డిని మారుస్తున్నారట. అవినాష్‌ రెడ్డి హత్య చేశాడు అని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఓడిపోతాడు అని నిర్ధారణకు వచ్చా రు. ఓటమి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మళ్లీ సీటు ఇచ్చారో…ఎందుకు మారుస్తున్నారో పులివెందుల ప్రజలకు జగన్‌ సమాధా నం చెప్పాలని ప్రశ్నించారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో సమాధా నం చెప్పాలి.

అన్నను నమ్మాను…దారుణ విషయాలు వెలుగుచూశాయి: వివేకా కుమార్తె సునీతా రెడ్డి
మార్చ్‌ 15న పొద్దున్నే ఫోన్‌ వచ్చింది. నాన్న చనిపోయారు అని పోలీస్‌ ఫిర్యాదు చేయొద్దని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చే వరకు ఆపమని నేను చెప్పాను. నేను ఏరియా ఆసుపత్రిలో చూడగూడని దృశ్యాలు చూశా. తల నుంచి ఎముకలు, మెదడు బయటకు వచ్చాయి. ఏమైందో అర్థం కాలేదు. పోలీసులు వస్తున్నారు..పోతున్నారు. అసలు ఏం జరిగిందో తేల్చు కోలేక పోయాం. చనిపోయిన ఇంట్లో నన్ను ఉండకూడదు అన్నారు. కూతు రువి కదా ఉండొద్దు అన్నారు. కూతురు అయినా, కొడుకు అయినా నేనే అని చెప్పా. ఎన్నికలు అయ్యే వరకు ఎవరు చేశారో తెలియలేదు. ఇంతలో ప్రభు త్వం మారింది. జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను కలిస్తే న్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు. సీఎంగా ఉండి దోషులకు శిక్ష వేయక పోతే నాకు అవమానం అన్నారు. అప్పుడు జగన్‌ అన్నను బాగా నమ్మాను. కేసు ఏటూ తేలలేదు. అనుమానం వచ్చి సీబీఐకి పోదామని ఆయనతో చెప్పా. అప్పుడు జగన్‌ నన్ను వద్దు అని చెప్పారు. మనం సీబీఐకి పోతే అవినాష్‌ రెడ్డి బీజేపీకి పోతాడట అని చెప్పారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా సీబీఐకి వెళ్లాలని…కోర్టును ఆశ్రయించా.

అప్పుడు కోర్టు ద్వారా న్యాయం జరిగి కేసు సీబీఐకి బదిలీ అయింది. విచారణలో దారుణ విషయాలు తెలిశాయి. వివేకాను చంపితే ఆయనకు కొడుకులు లేరు అనుకున్నారు. ఒక్క ఆడది ఏం చేస్తుందిలే అనుకున్నారు. ఆడది అంటే అబల కాదు…ఆది పరాశక్తి. ఇది న్యాయ పోరాటం. దోషులకు శిక్ష పడే పోరాటం చేస్తా. హత్య చేసిన వారికి శిక్ష పడాలి. షర్మిలను గెలిపిస్తే నా గొంతుగా పార్లమెంటుకు వెళుతుంది. మన కష్టాలు అర్థం చేసుకుంటుంది. అందుకే మనం షర్మిలను గెలిపించా లి..న్యాయం వైపు నేను, షర్మిల ఉన్నాము..పజలు ఏ వైపు ఉన్నారో అర్థం చేసుకోవాలి.

LEAVE A RESPONSE