తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి టైం వచ్చింది
ఎన్నికల కోసం తెలంగాణ నేతలు భజన మొదలు పెట్టారు
బాబు నాయుడు అరెస్ట్ అన్యాయం అని అంటున్నారే తప్ప…ఒక్కరు కూడా జరిగిన ఘటన గురుంచి మాట్లాడటం లేదు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో నేను ప్రచారానికి వస్తున్న.గత ఎన్నికల్లో చేసిన నినాదాల వల్ల, తెలంగాణ తెలుగుదేశం పార్టీ డైలామా లో పడింది.కానీ ఈ సారి రాబోయే ఎన్నికల్లో…మేము చాలా క్లియర్ గా ఉన్నాము చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష లో భాగంగా కేసులో ఇరికించారు.చంద్రబాబు నిజాయితీ ప్రపంచం అంత తెలుసు. రిమాండ్ కి తీసుకొంటే కొన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది. కానీ చంద్రబాబు విషయం లో పూర్తి భిన్నం గా జరిగింది.
చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేసి వైసీపీ వాళ్ళు చట్టాలు సృష్టించారు తలపండిన వారు అందరు నివ్వెరబోతున్నారు. చంద్రబాబు నాయుడు వేసిన బిక్ష నేటి హైదరాబాద్ అభివృద్ధి. వచ్చే ఎన్నికల కోసం తెలంగాణ నేతలు భజన మొదలు పెట్టారు…కేవలం ఎన్నికలు స్టంట్ కోసం భజన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్యాయం అని అంటున్నారే తప్ప…ఒక్కరు కూడా జరిగిన ఘటన గురుంచి మాట్లాడటం లేదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల యుద్దానికి సిద్ధం అయింది. ఓట్ల కోసం రాజకీయ లబ్ది కోసం భజన చేస్తున్నారు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి స్వేచ్చ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు.
లేనిది సృష్టించి చంద్రబాబు నాయుడు నీ అక్రమంగా అరెస్ట్ చేశారు.అరెస్ట్ లకు భయపడేది లేదు. న్యాయ పరం గా ఎంత దూరం అయినా వెళ్తాము. పార్టీ పునర్వైభవం కోసం ముందుకు వెళ్తాము. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు,నందమూరి తారక రామారావు ఇద్దరు నాయకులు కలిసి అద్భుతమైన పాలన అందించారు.తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అన్ని అనుబంధ సంఘాల తో కలిసి ముందుకు వెళ్తాము.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి టైం వచ్చింది.నా అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఒక తాటి పైకి వచ్చి కలిసి తెలంగాణ తెలుగుదేశం గెలుపు కోసం పోరాడాలి. ఆంధ్రప్రదేశ్ లో మతి స్థిమతం లేని నాయకుడు ఉన్నారు.తెలంగాణ నాయకుడు మసి పూసి మారేడుకాయ చేసే రకం. ఈ క్షణం నుంచి తెలంగాణ తెలుగుదేశం కోసం పునర్వైభవం కోసం కృషి చేస్తా.
కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ .. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి 26 రోజులు అయింది. దేశ వ్యాప్తంగా చంద్రబాబు కు మద్దతుగా తెలిపారు. ఓపిక నశిస్తే చాలా కష్టం..ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకోవాలి. కార్యకర్తల లో ధైర్యం నింపడానికి బాలకృష్ణ వచ్చారు…బాలకృష్ణ కు మా కృతజ్ఞతలు. ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధం గా ఉన్నారు.
అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పనికి మాలిన చర్య. తెలంగాణకు తెలుగుదేశం కు అవినాభవ సంబంధం ఉంది. అనేక కంపెనీ లు తెలంగాణ తేవడానికి చంద్రబాబు నాయుడు కృషి చెప్పలేంది. చంద్రబాబు నాయుడు దేశానికీ దిశ నిర్దేశం చేసిన వ్యక్తి. కొన్ని కోట్ల హృదయాలు చంద్రబాబు కోసం చూస్తున్నాయ్. IT ఉద్యోగులు సైతం మా పై ఒత్తిడి తెస్తున్నారు.
చంద్రబాబు నాయుడు కష్ట కాలం లో అవకాశం వెతికే వ్యక్తి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం సత్తా చూపిస్తాము. ఎన్నికల్లో మేము పూర్తి సిద్ధం గా ఉన్నాము. నందమూరి బాలకృష్ణ రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.