– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ, పార్టీ మారబోనని అన్నారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్లు గుర్తు చేశారు. హామీలు అమలు చేయాలని అడిగితే కేసులతో భయపెడు తున్నారని విమర్శించారు.