– నా కుమారుడు అమిత్ రెడ్డి కి పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటారు
– వారసుల కోసం వేరే పార్టీలోకి మేము వెళ్ళము
-బి ఆర్ యస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తధ్యం
– జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేది సహజం
– కేంద్రమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది
– విభజన హామీలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
– తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలోని తన ఛాంబర్ లో మీడియా మిత్రులతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నాం. విజయవంతం కావడానికి సహకరించిన ఆధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు కృతజ్ఞతలు .తెలంగాణ ప్రభుత్వం సాధించిన తొమ్మిది ఏండ్ల ప్రగతి ప్రజలకు వివరించే గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు .
మోడల్ స్కూల్ కాన్సెప్ట్ UPA ప్రభుత్వం తెచ్చిందే కానీ, NDA ప్రభుత్వం వచ్చాక మోడల్ స్కూల్స్ ని నిర్లక్ష్యం చేసింది. వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో నేను ఎక్కడా పోటీ చేసేది లేదు.నా కుమారుడు అమిత్ రెడ్డి కి పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటారు.
మా జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మళ్ళీ మేమే గెలుస్తాం. మార్పులు చేర్పులు చేస్తే కొత్త వారికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు కొంతమంది BRS పార్టీలో చేరే అవకాశం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. బి ఆర్ యస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తధ్యం.
తెలంగాణ రాష్ట్రంపైన సమగ్ర అవగాహన కలిగిన ఏకైక నాయకుడు ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. రెండు జాతీయ పార్టీల అధ్యక్షులకు రాష్ట్రంపై ఎలాంటి అవగాహన లేదు.. వారికి అస్సలు విషయ పరిజ్ఞానం లేదు.మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అని చెప్పే తెలివి రెండు జాతీయ పార్టీల నాయకులకు లేదు. మనిషి అన్నప్పుడు కలలు కనాలి కానీ బిజెపి, కాంగ్రెస్ నేతలు మాత్రం పగటి కలలు కంటున్నారు.
కాంగ్రెస్ లో చేరుతాం అని చెప్పుకునే ఖమ్మం, మహబూబ్ నగర్ నేతలు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఉహించుకుంటున్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని నా కోరిక.దేశంలో ఏ రాష్ట్ర అభివృద్ధి చెందని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది.జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేది సహజం. జిల్లా నాయకత్వం పై పూర్తిస్థాయి సంతృప్తి ఎక్కడా ఉండదు. ఎన్నికలు వచ్చిన్నపుడల్లా చేరికలు, మార్పులు, చేర్పులు అనేది సహజం.
ఖమ్మంలో 2018 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు BRS కు వస్తాయి. కాంగ్రెస్ లేకుండా కూటమి అని కేసీఆర్ అన్నాడు అందుకే విపక్ష సమావేశాలకు కేసీఆర్ వెళ్లడం లేదు. వేముల విరేశం కాంగ్రెస్ లోకి వెళ్తారు అనేది వాస్తవం కాదు. వారసుల కోసం వేరే పార్టీలోకి మేము వెళ్ళము. అవకాశం రాకపోతే పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తాం.
వారసత్వ రాజకీయాలు అనేవి కేవలం గుర్తింపు వరకు మాత్రమే. గెలుపు కోసం పనికిరావు.రేవంత్ రెడ్డి మాటలకు అంతూ పొంతు ఉండదు.రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా? రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి రేవంత్ రెడ్డి ఇచ్చాడు. ఫిరాయింపు ఆపేందుకు చట్టం తేవాల్సింది కేంద్రమే.అలాంటి కేంద్రమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందే తప్ప ఒక్క న్యాయం చేయలేదు. రెండు రాష్ట్రాల విభజన హామీలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యింది.