– కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రాష్ట్రప్రభుత్వం పాటించాలి
– జనసంఘ్ ఫౌండర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్ర బిజెపి కి ఆదర్శం.
– కృష్ణా జిల్లా చిరువోలు శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్థంతి కార్యక్రమం లో కేంద్ర మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్
తొమ్మిది సంవత్సరాల లో మహిళా సంఘాలు ఎన్ని వచ్చాయి ఎలా ఉన్నాయి?5వేల నుండి 20లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు పలకాలి.రుణాలు తీసుకుని మహిళా సంఘాలు బలోపేతం కావాలి.సంఘాలు పనితీరు సంఘాలు సభ్యులు తో మంత్రి చెప్పించారు.సంఘం లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.నైపుణ్యం పెంచుకుని గ్రూప్ బలో పేతం చేసుకోవాలి. ఆన్ లైన్ మార్కెటింగ్ చేయాలి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు చెప్పండి.చాలా సంతోషం..నరేంద్ర మోడీ ప్రభత్వ పని తీరు వల్ల ప్రజలు క్షేమంగా ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేంద్రం ఇస్తుంటే రాష్ట్రం మాత్రం కేంద్రం ఫొటోలు వినియోగించడం లేదు. పధకాలకు పేర్లు మార్చుకొవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
పోషణ్ అభియాన్ కేంద్రం నిధులు ఎందుకు పేరు మార్చారు? ఆరోగ్యశాఖ లో ఆయుష్మాన్ భారత్ పేరు రాష్ట్రంలో పేరు మార్చారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. గతంలో వ్యాక్సిన్ లు భారతదేశం దిగుమతి చేసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం లో 98దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేశాం ప్రగతి అంటే ఇది.
కిసాన్ సమ్మాన్ నిధి రైతు లకు ఆర్థిక సహకారం నేరుగా అందిస్తూన్నాం.స్వచ్చ భారత్ అభియాన్ ద్వారా అన్ని రాష్ట్రాల కు నిధులు మంజూరు.ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కళాశాల లు సంఖ్య పెంచాం. ఏపీ కి వెల్ నెస్ సెంటర్ లు ఇచ్చాం.వైద్య సేవలు పెంచడానికి చర్యలు తీసుకున్నాం.బడ్జెట్ ప్రతి సంవత్సరం పెంచుతున్న పరిస్థితి.
ఆయుష్మాన్ భారత్ లో వైద్యానికి సౌకర్యాలు.అన్ని విభాగాల్లో అంటే మౌలిక వసతులు కల్పించడం జరిగింది.ఇంటింటి ప్రచారం చేస్తూ లబ్ది దారులు ను కలుస్తాం.స్వయం సహాయక సంఘాలు తో సమీక్ష చేయడం జరిగింది.ఒక్కో సంఘానికి 20లక్షల రుణం మంజూరు చేస్తాం..
మొబైల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ లో గణనీయ ప్రగతి సాధించాం. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రాష్ట్రప్రభుత్వం పాటించాలి . భారతీయ జనసంఘ్ ఫౌండర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్ర బిజెపి కి ఆదర్శం.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ..బెంగాల్ వాసి.. అయిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడు.. దేశభక్తి లేని కాంగ్రెస్ పోకడలను విభేదించారు.1947 నుండి 51వరకు పరిశ్రమలు శాఖ మంత్రి గా చేశారు.ప్రొ పాకిస్థాన్ విధానం నెహ్రూ అవలంభించి డం తో విభేదించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు.దేశభక్తి తో కూడిన పార్టీ ఉండాలని భావించి భారతీయ జనసంఘ్ ఏర్పాటు చేశారు.
ఆయన తో వాజపేయి , జోషి వంటి నేతలు పని చేశారు.కాశ్మీర్ కు ప్రత్యేక జెండా నెహ్రూ ఏర్పాటు చేయడాన్ని శ్యాం ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారు.ఆయన కాశ్మీర్ వెడితే కాశ్మీర్ లో అరెస్టు చేసి ఒక గది లో బంధిస్తే అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఒక బలిదానం గా బిజెపి భావిస్తోంది.
ఆర్టికల్ 370రద్దు నరేంద్ర మోడీ రద్దు చేశారు.మన భూభాగం పాకిస్థాన్ లో ఉందంటే నెహ్రూ తో పార్లమెంటు లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆరోజు విభేదిస్తూ మాట్లాడి తే నెహ్రూ సహించ లేకపోయారు. అమెరికా లో నరేంద్ర మోడీ కి బ్రహ్మరధం పడుతున్నారు.నరేంద్రమోడీ విశ్వ నేత.