– కూలిపనులు చేస్తున్న ఆడపిల్లలకి నారా లోకేష్ భరోసా
ఆ నిరుపేద తండ్రికి ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయిని చదివిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు చదువు మానేసి తండ్రితోపాటే కూలీ పనులకి వెళ్లడం, కూల్ డ్రింక్స్ షాప్ నిర్వహించడంలో చేదోడుగా ఉంటున్నారు. మండే ఎండల్లో ఉరవకొండ నియోజకవర్గం,కూడేరు మండలం, కమ్మూరు గ్రామానికి చెందిన పనకచర్ల రామలింగం జీవనపోరాటం ఇది. యువగళం పాదయాత్రలో రామలింగం కుటుంబం నారా లోకేష్ గారిని కలిశారు. పెద్ద బిడ్డ ఇంజనీరింగ్ చదువుతోందని, మిగిలిన ఇద్దరినీ చదివించే స్థోమత లేకపోవడంతో తనతోపాటు కూలీ పనులకి, జ్యూస్ షాపులో పనికి వస్తున్నారని రామలింగం లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. నేను మీకు అన్నలా అండగా ఉండి చదివిస్తానంటూ లోకేష్ భరోసా ఇవ్వడంతో అమ్మాయిలు లిఖిత, గౌరీల ఆనందంతో ఎగిరి గంతేశారు. తన దృష్టికి వచ్చిన సమస్య అయినా, సహాయం అయినా నారా లోకేష్ అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.