– కడప జిల్లా నేత, మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి కి భద్రత తొలగించడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యంతరం
– బీటెక్ రవికి భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ డీజీపీకి చంద్రబాబు నాయుడు లేఖ
లేఖలో అంశాలు:-
ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసిందనే కారణంతో బిటెక్ రవి భద్రతను తొలగించడం సరికాదు. 2006 నుంచి బిటెక్ రవికి 1 ప్లస్ 1 సెక్యూరిటీ కవర్ ఉంది. రాజకీయ ప్రత్యర్థులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి రవికి నిరంతరం బెదిరింపులు ఉన్నందున భద్రత కొనసాగింది.
ఎమ్మెల్సీగా ఎన్నికైన బిటెక్ రవికి 2+2 భద్రత కల్పించారు. అయితే ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడాన్ని సాకుగా చూపి అతని భద్రతను తొలగించారు. MLC పట్టభద్రుల నియోజకవర్గానికి పోలింగ్ జరిగిన మార్చి 13వ తేదీన అతని కాన్వాయ్‌పై గూండాలు దాడి చేశారు.దాడిలో అతని కారు ధ్వంసమైంది. రవి తృటిలో తప్పించుకున్నారు.
బీటెక్ రవిని రాజకీయ ప్రత్యర్థులు భౌతికంగా తొలగించే ప్రమాదం ఉంది. వివేకా హత్య కేసులో బిటెక్ రవిని నిందితుడిగా చేర్చాలని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీటెక్ రవికి ఏదైనా హాని జరిగితే పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లాలో రాజకీయ పరిస్థితుల కారణంగా బీటెక్ రవికి తగిన భద్రత కల్పించాలి.