చంద్రబాబును ఓడించకపోతే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్లు తుడుస్తా

– దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయమనండి
– చంద్రబాబు ఛాలెంజ్ లను పట్టించుకోనవసరం లేదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి , సెప్టెంబర్ 21 : చంద్రబాబునాయుడును కుప్పం నియోజకవర్గంలో ఓడించకపోతే తాను రాజకీయాలను వదిలేసి ఆయన బూట్లు తుడుస్తూ కాళ్ళ దగ్గర కూర్చుంటానని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు . తాను బూతుల మంత్రిని అయితే చంద్రబాబు బూతులు తిట్టించుకునే ప్రతిపక్ష నాయకుడా అని అన్నారు . చంద్రబాబుకు 73 ఏళ్ళ వయస్సు వచ్చిందని , ఇంకెంత కాలం ఉంటాడో తెలీదన్నారు . ఎన్నికల ప్రచార సభల్లో మీకు సిగ్గు , పౌరుషం ఉన్నాయా , మనిషి జన్మ ఎత్తారా , సిగ్గు , శరం ఉంటే వైసీపీకి ఓటు వేస్తారా అని అంటే చంద్రబాబును మీడియా ఎందుకు అడగలేదని అన్నారు . ఓడిపోతే చంద్రబాబు పిచ్చికుక్కలా , ఆయన కొడుకు గజ్జి కుక్కలా మొరుగుతున్నారని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు . నేనేమీ అననని అడుగుతున్నారా అంటూ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు .
చంద్రబాబుకు బ్లాక్ క్యాట్ గన్‌మెన్లు ఉన్నారని భయపడుతున్నారా అని అన్నారు . ప్రభుత్వానికి సవాల్ విసిరే స్థాయి చంద్రబాబుకు లేదని ,కుప్పంలో చంద్రబాబు ఓడిపోకపోతే రాజకీయాలను వదిలేస్తానన్నారు. చంద్రబాబుకు బూట్లు తుడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటానని , దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయమనండి అని అన్నారు . చంద్రబాబు ధైర్యవంతుడు , పోటుగాడు అయినపుడు ఎన్నికలకు వెళ్ళాచ్చని చెప్పారు . కొడుకును మంగళగిరిలో , వెనక తిరిగే ఎమ్మెల్యేలు , ఎంపీలను సవాళ్ళు విసిరే చంద్రబాబు గెల్పించేశాడంటూ ఎద్దేవా చేశారు . విజయమ్మతో కలిసి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళిన జగన్మోహనరెడ్డి తన దెబ్బ ఎలా ఉంటుందో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు , ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు చూపించారన్నారు . అలా చంద్రబాబు కూడా ఎన్నికలకు వెళ్ళి తన సత్తాను రాష్ట్ర ప్రజలు చూపించవచ్చు కదా అని అన్నారు . అలా కాకుండా పదేపదే మమ్మల్ని రాజీనామా చేయమని అడగడం , ఛాలెంజ్ ను నిజమని స్వీకరించి తాము ఎన్నికలకు వెళ్తే బహిష్కరించామని చంద్రబాబు పారిపోతాడన్నారు . మంచి రాజకీయ నాయకుడు , మాటపై నిలబడే వ్యక్తి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే తప్పకుండా స్వీకరిస్తామన్నారు . చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు , అవసరానికి నాలుగు అబద్దాలు ఆడి , ఏదో విధంగా కొంపలు కూల్చేవాడు చేసే ఛాలెంజ్ లను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు . చంద్రబాబు ఛాలెంజ్ చేశాడంటే దాని వెనుక పెద్ద ప్లాన్ ఉంటుందని , ఆయన డైరెక్ట్ గా రాడని , వెనుక నుండి మాత్రమే వస్తాడని మంత్రి కొడాలి నాని విమర్శించారు.

Leave a Reply