Home » సీఎం జగన్ ను తక్కువ చేసి మాట్లాడితే చంద్రబాబుకు బట్టలూడదీసి అమ్మనాబూతులు తిడతాం

సీఎం జగన్ ను తక్కువ చేసి మాట్లాడితే చంద్రబాబుకు బట్టలూడదీసి అమ్మనాబూతులు తిడతాం

– పక్క రాష్ట్రంలో బతికే నలుగురు కుక్కలు ఏం చేయలేరు
– ఏ ఎన్నికలు జరిగినా టీడీపీకి మెరుగైన ఫలితాలు రావు
– సీఎం వైఎస్ జగన్ పాలనలో సుభిక్షంగా రాష్ట్ర ప్రజలు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి , సెప్టెంబర్ 21 : సీఎం జగన్మోహనరెడ్డిని తక్కువ చేసి మాట్లాడితే చంద్రబాబుకు బట్టలూడదీసి అమ్మనాబూతులు తిడతామని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) హెచ్చరించారు . మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు . మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు . కాల్ మనీ , సెక్స్ రాకెట్ , డబ్బులు అప్పుగా ఇచ్చి వ్యభిచార కూపంలోకి దించడం వంటివి చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నారు . టీడీపీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు , నాయకులే వ్యభిచార కొంపగా తయారు చేశారన్నారు . చంద్రబాబుకు సిగ్గు లేదని , ఆయన మనిషి జన్మ ఎత్తలేదన్నారు . ఆయనకు ఆడపిల్లలు లేకపోవడం వల్ల ఇటువంటివి అనేకం ప్రోత్సహించారన్నారు . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడ సీపీగా ఉ న్న ఇప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను సెలవులో పంపి సెక్స్ రాకెట్ ను ప్రోత్సహించారన్నారు . అందువల్లే టీడీపీకి ప్రజలు 23 సీట్లు ఇచ్చారని , మంగళగిరిలో లోకేష్ ను ఓడించి కృష్ణానదిలో కలిపారన్నారు . చంద్రబాబు లాంటి సన్నాసులు మాత్రమే సెక్స్ రాకెట్లు , మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తారన్నారు .
సీఎం జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్కా , మట్కా , పేకాట క్లబ్ లు అన్నింటినీ మూయించి వేశారన్నారు . చంద్రబాబు ఉండేది హైదరాబాద్ లోనని , పార్టీని మాత్రం ఆంధ్రప్రదేశ్ లో నడుపుతుంటాడన్నారు . చంద్రబాబు లాంటి పనికిమాలిన వ్యక్తులు హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లోని కాల్వగట్టుపై అడ్రస్టు పెట్టుకుని మాదక ద్రవ్యాలను విక్రయించి ఉంటారన్నారు . చంద్రబాబుకు , మాదక ద్రవ్యాలు విక్రయించే వాడికి దగ్గర పోలికలు , లక్షణాలు ఉన్నాయి కాబట్టే వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు . చంద్రబాబు , ఏబీఎన్ , టీవీ 5 , ఈటీవీ కలిసి సీఎం జగన్ ను పట్టుకుని వేలాడినా ఆయనను కొంచెం కూడా కదపలేరన్నారు . కోట్ల మంది ప్రజల హృదయాల్లో జగన్మోహనరెడ్డి గూడు కట్టుకున్నారన్నారు . పేదవాడి పార్టీ అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని , పేదవాడి జెండా అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అని అన్నారు . పేదవాడికి పట్టెడన్నం పెట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద పిల్లలను స్కూల్ కు పంపి పైసా ఖర్చు లేకుండా ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తోందన్నారు . నాణ్యమైన భోజనం పెడుతోందని , పేదవాడికి ఆరోగ్య సమస్యలు వస్తే కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఉచితంగా వైద్యం చేయిస్తోందన్నారు .
రాష్ట్రంలో 30 లక్షల నిరుపేదలకు ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్నారన్నారు . అన్ని వర్గాలకూ రాజకీయంగా మంచి పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు . పేద వర్గాలను ఆర్ధికంగా , సామాజికంగా పైకి తీసుకురావడానికి సీఎం జగన్మోహనరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు . దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో వైఎస్సారన్ను కోల్పోవడం వల్ల రాష్ట్రం రెండు ముక్కలైందన్నారు . పేదవాడు దిక్కులేని పరిస్థితికి వెళ్ళాడన్నారు . మహానుభావుడు కడుపున పుట్టిన జగన్మోహనరెడ్డిని నమ్ముకుని రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారన్నారు . జగన్మోహనరెడ్డి బతికి ఉన్నంత కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటున్నారన్నారు చంద్రబాబు లాంటి నలుగురు వెధవలు , సన్నాసులు జగన్ పై మట్టి , బురద జల్లినా , ఏం చేసినా ఆకాశంపై ఉమ్మి వేసినట్టుగా వారి ముఖం పైనే పడుతుందన్నారు . కుళ్ళి నశించిపోవడం తప్పించి సీఎం జగన్మోహనరెడ్డి పరపతి , స్థాయిని , ఆలోచనా విధానాన్ని కొంచెం తగ్గించలేరన్నారు . ఈ ప్రయత్నాలు నిరంతరం చేసుకోవచ్చని , తమకేమీ అభ్యంతరం లేదన్నారు . పక్క రాష్ట్రంలో బతికే నలుగురు కుక్కలు సీఎం జగనను ఏమీ చేయలేరని , ఇక్కడి ప్రజలు జగన్ పాలనలో బ్రహ్మాండంగా ఉన్నారన్నారు . ఎప్పుడు ఎన్నికలు జరిగినా , చంద్రబాబు వాటిని బహిష్కరించినా టీడీపీకి పరిషత్ ఎన్నికల కన్నా మెరుగైన ఫలితాలు రావని మంత్రి కొడాలి నాని చెప్పారు .

Leave a Reply