Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పిచ్చి వేషాలు వేయకుండా హైదరాబాద్ లో శేషజీవితం గడుపుకోవాలి

– చంద్రబాబు , లోకేష్ ను దారుణంగా తిట్టగలం
– వైఎస్ జగన్ వదిలేయమంటే తిట్టలేకపోతున్నాం
– అయ్యన్నపాత్రుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి
– దేవినేని ఉమా పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి , సెప్టెంబర్ 21 : చంద్రబాబు పిచ్చి వేషాలు వేయకుండా తన శేష జీవితాన్ని హైదరాబాద్ లో గడుపుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) సూచించారు . మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు . సీఎం జగన్మోహనరెడ్డిని పప్పు లోకేష్ దగ్గర నుండి గంజాయి అమ్ముకునే చింతకాయల అయ్యన్నపాత్రుడు వరకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు . చంద్రబాబు , లోకేష్ లను తాను కూడా దారుణాతి దారుణంగా బూతులు తిట్టగలనని చెప్పారు . సీఎం జగన్ మాత్రం సంస్కార హీనంగా మాట్లాడుతున్న వారిని కూడా వదిలి పెట్టాలని అంటున్నారని , అందువల్లే తిట్టలేకపోతున్నామన్నారు . చంద్రబాబు పగ , ప్రతీకారాలతో సీఎం జగన్ పై నిత్యం రగిలిపోతూ ఉన్నాడని అన్నారు . ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నట్టుగా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని సీఎం జగన్ లాక్కున్నట్టుగా భావిస్తున్నాడన్నారు .
సీఎం జగన్ పై చంద్రబాబు , లోకేష్ , టీడీపీలోని కొంత మంది వ్యక్తులు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారన్నారు . రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని , దేవుడు ఆశీర్వదిస్తున్నారని సీఎం జగన్మోహనరెడ్డి చెబుతుంటారన్నారు . చంద్రబాబు లాంటి వ్యక్తులను పట్టించుకోనవసరం లేదని , ప్రజలకు సేవ చేయడానికి , వారి అవసరాలను తీర్చి పట్టెడన్నం పెట్టడానికి వచ్చామన్నారు . చంద్రబాబు లాంటి వ్యక్తులను చూసి భయపడాల్సిన అవసరం లేదని పదే పదే సీఎం జగన్ చెప్పడం వల్లే తుప్పు , పప్పులను వదిలేస్తున్నామన్నారు . ఇకపై చంద్రబాబు , లోకేష్ , అచ్చెన్నాయుడు , అయ్యన్నపాత్రుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నారు . ఇంకోసారి సీఎం జగనను ఒక్క మాట అనవసరంగా మాట్లాడితే చంద్రబాబు , లోకేష్ ల బట్టలు ఊడదీసి రోడ్డుపై నిలబెట్టి అమ్మనాబూతులు తిడతానన్నారు . రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు , కష్టాలు ఉంటే ప్రతి సోమవారం గ్రీవెన్స్ లో అర్జీలు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు .
తెలుగుదేశం పార్టీ పందికొక్కులు మాత్రం కృష్ణాజిల్లాలో దేవినేని ఉమాను గ్రీవెన్స్ కు పంపారన్నారు . అధికారుల దగ్గరకు వెళ్ళి వచ్చేది మేమేనని ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు . దేవినేని ఉమా తన దగ్గరకు ఆ కాగితాలను పట్టుకుని వస్తే బాగుండేదన్నారు . అధికారంలోకి వచ్చి వాళ్ళు చూసేదేంటో చెప్పేవాడినని అన్నారు . విజయవాడలోనే తాను , ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉంటామని , అర్జీలు పట్టుకుని దేవినేని ఉమా రావాలన్నారు . ఐదేళ్ళు మంత్రిగా , 22 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకారని ప్రశ్నించారు . అధికారులను , ప్రజాప్రతినిధులను భయపెడుతూ ఎప్పటికీ అధికారంలోకి రాలేరని అన్నారు . నిత్యం అధికారంలోకి వస్తామని భ్రమల్లో బతుకుతున్నారన్నారు . ఎక్కడైనా అధికారులు , ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్ళి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాటతీస్తామన్నారు . అర్జీలు పట్టుకుని దేవినేని ఉమా ఎక్కడికి వస్తాడో చెప్పి రావాలన్నారు . అధికారులను బెదిరిస్తే మళ్ళీ కేసులు పెట్టి దేవినేని ఉమాను జైలుకు పంపాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు . ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని దేవినేని ఉమాను మంత్రి కొడాలి నాని హెచ్చరించారు .

LEAVE A RESPONSE