సీఎం జగన్‌ లా పాలన చేసివుంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఉండేది కాదంటున్న చంద్రబాబు

– పరిషత్ ఫలితాలను చూడలేకపోతున్న చంద్రబాబు
– బహిష్కరిస్తే కుప్పంలో టీడీపీ ఓటర్లు వైసీపీకి ఓటేశారా
– పారిపోవడం చంద్రబాబు నరనరాన జీర్ణించుకునుంది
– భవిష్యత్తులో టీడీపీకి అభ్యర్ధులు దొరకని పరిస్థితి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి , సెప్టెంబర్ 21 : చంద్రబాబు కూడా సీఎం జగన్మోహనరెడ్డిలా పాలన చేసివుంటే ఇప్పుడు అధికార పక్షం ఉండేది కాదని అంటున్నాడని , దీన్నిబట్టి ఇక చంద్రబాబు ఉండడని అర్ధమవుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు . పరిషత్ ఎన్నికల ఫలితాలు సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నట్టుగా వచ్చాయన్నారు . ఇది చూడలేని చంద్రబాబు మాత్రం సొల్లు కబుర్లు చెబుతూ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెబుతున్నాడన్నారు . తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తే ఆ పార్టీ ఓట్ బ్యాంక్ వైసీపీకి టర్న్ అయిపోతుందా అని ప్రశ్నించారు . కుప్పంలోని నాలుగు జడ్పీటీసీ స్థానాల్లో చంద్రబాబుకు 21 వేల ఓట్లు వచ్చాయని , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 89 వేల ఓట్లు లభించాయన్నారు . చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తే కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ వైసీపీకి ఓటు వేసేశారా అని ప్రశ్నించారు . పరిషత్ ఎన్నికల్లో 15 శాతం ఇతర పార్టీలు గెలిచాయని , దీనిలో 10 శాతం టీడీపీ గెల్చుకుందన్నారు . గెల్చిన ఎంపీటీసీల్లో , జడ్పీటీసీల్లో ఎవరినో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోవాలని , పారిపోయే చంద్రబాబు లాంటి చవట దద్దమ్మను తీసేయాలన్నారు .
గతంలో ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి పదేళ్ళు రాజధానిగా అవకాశం ఉన్నా హైదరాబాదు తెలంగాణా ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించి అక్కడి నుండి పారిపోయి ఇక్కడ కాల్వగట్టున దాక్కున్న చవట దద్దమ్మ చంద్రబాబు అని అన్నారు . కరోనా వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరంగా హైదరాబాద్ లోని ఇంట్లో దాక్కున్నాడన్నారు . ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే హైదరాబాద్ నుండి స్టేట్మెంట్లు ఇస్తున్నాడన్నారు . పారిపోవడం చంద్రబాబు రక్తంలో , నరనరాన జీర్ణించుకుపోయి ఉందన్నారు . భూమి గుండ్రంగా ఉంటుందని , అధికారంలోకి మేమే వస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు . 22 ఏళ్ళు అధికారంలో ఉన్నామని , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలా చేసివుంటే ఇప్పుడు ఆ పార్టీ ఉండేదా అని చంద్రబాబు మాట్లాడుతున్నాడన్నారు . జగన్మోహనరెడ్డి మంచి పాలన అందించడం వల్ల రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ ఖాళీ అయిపోయాయని చంద్రబాబు ఒప్పుకుంటున్నాడన్నారు . చంద్రబాబు చెబుతున్న మాటలను టీడీపీ నేతలు అర్ధం చేసుకోవాలన్నారు . తుప్పు , పప్పు నాయుడులను నమ్ముకుంటే టీడీపీకి తెలంగాణాలో పట్టిన గతి ఆంధ్రప్రదేశ్ లోనూ పడుతుందన్నారు . ఇప్పటికే తెలంగాణాలో ఎన్నికలను బహిష్కరించానని అక్కడ పోటీ చేయలేదని , పరిషత్ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ లో బహిష్కరించి నాంది పలికాడని చెప్పాడు . రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్ధులు దొరికే పరిస్థితి ఉండదని మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు .

Leave a Reply