Suryaa.co.in

Andhra Pradesh

పెన్షన్లను ఇంటి దగ్గర లేదా అకౌంట్‌లో జమ చేయండి

-గత మార్గదర్శకాలు పాటించాలి
-పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్‌ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మార్చి 30న జారీ చేసినట్టు ఈసీ వెల్లడిరచింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలుచేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి తేల్చిచెప్పింది.

పెన్షన్లను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించవచ్చని, ఈ విషయాన్ని గత ఆదేశాల్లో స్పష్టం చేశామని వెల్ల డిరచింది. పంపిణీలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, లబ్ధిదా రులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎలక్ట్రానిక్‌ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయొచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని మరోమారు సూచించింది.

LEAVE A RESPONSE