Suryaa.co.in

Andhra Pradesh

కత్తి పట్టిన వారు ఆ కత్తితోనే నాశనమవుతారు

-హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు
-మోరంపూడి రచ్చబండలో నారా లోకేష్‌

హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు..చంద్రబాబు ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు.. నీతి, నిజాయితీలతో పనిచేశారు..కత్తి పట్టుకున్న వారు ఆ కత్తితోనే నాశ నం అవుతారని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోరం పూడి గ్రామంలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్‌ పాల్గొన్నారు. తెలుగుదేశానికి పట్టుకున్న నియోజవర్గాల్లో పోటీచేయాలని అనేకమంది సూచించినా ప్రజలో, లోకేషో తేల్చుకుంటానని చెప్పా. అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మంగళగిరిని తీర్చిది ద్దుతా..భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు.

ఈ సందర్భంగా మోరంపూడి వాసులు తమ సమస్యలను లోకేష్‌ దృష్టికి తీసుకువచ్చారు. దళిత స్మశాన వాటిక ప్రహరీ గోడ, గది నిర్మించాలని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, ముస్లింల కబరస్థాన్‌కు స్థలం కేటాయిం చాలని, మహంకాళీ అమ్మవారి దేవస్థానానికి వెళ్లే రహదారిని విస్తరించాలని కోరారు. చర్చికి టవర్‌ నిర్మించాలని, వైఎస్సార్‌ చేయూత పథకం అందడం లేదని, గ్రామంలో హైస్కూల్‌ నిర్మిం చి ఆటస్థలం ఏర్పాటుచేయాలని విన్నవించారు.

లోకేష్‌ స్పందిస్తూ దామాషా ప్రకారం స్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తాం. దళితుల స్మశాన వాటికను అభివృద్ధి చేస్తాం. అండర్‌ గ్రౌండ్‌ డ్రేనేజీ నిర్మాణంతో పాటు కొళాయి ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తాం. అమ్మవారి దేవస్థానం రహదారిని విస్తరిస్తాం. చర్చికి టవర్‌ విషయంలో పరిశీలించి నిర్ణయం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోతలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తా మని, హైస్కూల్‌, ఆటస్థలం విషయంలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE