Home » పార్టీ మారిన వారిని మళ్లీ చేర్చుకోం

పార్టీ మారిన వారిని మళ్లీ చేర్చుకోం

-కోడ్‌ ముగిసిన తర్వాత ప్లీనరీ
-పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు
-14 ఏళ్లు ఉద్యమం, 10 ఏళ్లు అధికారంలో ఉన్నాం
-కేసీఆర్‌ ఉంటే బాగుండేదని ప్రతిఒక్కరూ అంటున్నారు
-బస్సు యాత్రలో అనూహ్య స్పందన వస్తోంది
-సీట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించాం
-హరీష్‌రావు రాజీనామా సవాల్‌పై రేవంత్‌ స్పందించాలి
-తెలంగాణలో మార్పును ప్రజలు అర్థం చేసుకున్నారు
-ఏపీలో జగన్‌ మళ్లీ గెలుస్తారు
-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చిట్‌చాట్‌

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం మీడియాతో చిట్‌ చాట్‌లో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ప్లీనరీ ఉంటుందని వెల్లడిరచారు. పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదని…14 ఏళ్లు ఉద్యమం, 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని చెప్పారు. కేసీఆర్‌ సీఎంగా ఉంటే బాగుండేదని ప్రతిఒక్కరూ అంటున్నారు. తెలంగాణలో జరిగిన మార్పును ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకున్నారు. కేసీఆర్‌ బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది.

సీఎం రేవంత్‌ తన పార్లమెంట్‌ పరిధిలో 10 సార్లు వెళ్లారు. అక్కడ గెలవడానికి ఆపసోపాలు పడుతున్నారు. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌చార్జ్‌ అని చెప్పి మార్చుకున్నారు. ఆ పార్టీకి గడ్డు కాలం నడుస్తోంది. రైతు బంధు, పంటలకు బోనస్‌, నిరుద్యోగులకు భృతి, ఫ్రీ స్కూటీ, తులం బంగారం ఏమీ ఇవ్వలేదు. డిసెంబర్‌ 9న రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు ఆగస్టు 15 అని దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే, కొడంగల్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపో తే రాజకీయ సన్యాసం అని చెప్పి రేవంత్‌ మాట తప్పారు. హైదరాబాద్‌లో ప్రజల ఆశీర్వాదం మాకే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో మార్పు మొదలైంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని బీఆర్‌ఎస్‌ పాటించింది. మూడు ఎస్సీ సీట్లలో రెండు మాదిగ, ఒకటి మాలకు ఇచ్చాం. 12 జనరల్‌ స్థానాల్లో ఆరు బీసీలకు ఇచ్చాం. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పద్మారావుకు ఇవ్వడంతో తెలంగాణ ఉద్యమ కారులు సంతోషంగా ఉన్నారు. నాలుగు రెడ్డి, ఒక వెలమ, ఒక కమ్మ సామాజికవర్గానికి అవకాశం ఇచ్చాం.

కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు…

2014లో బడా భాయ్‌…2023లో చోటా భాయ్‌ మోసం చేశారు. తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారు. ఏడు మండలాలను అంధ్రాలో కలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ మోదీ ఇవ్వలేదు. దేశ ప్రజల నుంచి మోదీ 30 లక్షల కోట్లు వసూలు చేశారు. దేశంలో ఒక్క టోల్‌ గేట్‌ లేని జాతీయ రహదారి ఉందా పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెంపుతో సెస్‌ వసూలు చేశారు. 14 లక్షల కోట్లు ఆదానీ, అంబానీ కంపెనీలకు వెళ్లా యి. కేసీఆర్‌ శాసించే స్థాయిలో ఉండాలంటే 12 ఎంపీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలవాలి.

తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ స్థానాల్లో కాం గ్రెస్‌ మూడవ స్థానంలో ఉంది. అయితే కాంగ్రెస్‌ గెలవాలి..లేకపోతే బీజేపీ గెలవాలి అన్నట్లు రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సపోర్టుగా బీజేపీ పెద్దపల్లి, నల్గొండ, భువన గిరి, ఖమ్మం పార్లమెంట్‌ స్థానాల్లో బలహీన అభ్యర్థులను పోటీలో పెట్టింది. కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్‌ ప్రజలకు తీరని గాయంగా మారింది. కడియం కావ్య మూడవ స్థానంలో ఉంటారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగిస్తామని చెప్పిన రేవంత్‌ వరంగల్‌ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

హరీష్‌రావు రాజీనామా సవాల్‌పై రేవంత్‌రెడ్డి స్పందించాలి…

సీఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకే కట్టుబడి లేడు. రుణమాఫీ ఎప్పుడూ చేయడు. మల్లారెడ్డి చాలా తెలివైన రాజకీయ నాయకుడు. ఈటెల రాజేందర్‌ను బోల్తా కొట్టించే ప్రయత్నం చేశా రు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వెళ్లిన వాళ్లను కాంగ్రెస్‌ కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. పార్టీ మారితే గౌరవం ఉండదని ఈటెల రాజేందర్‌ స్వయంగా చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వా త రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు ఉంటాయి. పార్టీ మారిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోము. మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు పోటీ చేస్తున్న స్థానాల్లో ఫోకస్‌ పెడతాం. ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేని పార్టీలు దేశంలో 13 ఉన్నాయి. ఓట్లు వేయకపోతే ఫ్రీ బస్సు ఎత్తివేస్తామని రేవంత్‌ రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.

ఖమ్మం పార్లమెంట్‌ స్థానాన్ని కచ్చి తంగా బీఆర్‌ఎస్‌ గెలుస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. సిరిసిల్లలో మళ్లీ ఆత్మహత్యలు మొదలు అయ్యాయి. రాహుల్‌ గాంధీ కేరళలో సీపీఎంను తిడుతున్నారు. దేశంలో మిగతా ప్రాంతాల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీని ఎదు ర్కొనే సామర్థ్యం ఆ పార్టీకి లేదు. కాళేశ్వరంపై కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే తప్పు ఏముంది. కమిటీ విచారణకు పిలిచినప్పుడు చూద్దాం. ఏపీలో ప్రాంతీయ పార్టీలు గెలవాలి. మాకున్న సమాచారం మేరకు ఏపీలో జగన్‌ గెలుస్తారు. సీపీఎం ముఖ్యమంత్రిని బండ బూతులు తిట్టిన కాంగ్రెస్‌ సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణలో ఎట్లా మద్దతు ఇస్తారు అని ప్రశ్నించారు.

Leave a Reply