– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
జగన్ ఏమి అబద్దాలు చెప్పారో చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురు ప్రశ్న వేశారు? బహిరంగ చర్చకు ఎందుకు రావాలని మరో ప్రశ్న వేశారు? హామీల్లో 99.5% అమలు చేశామని జగన్ పదే పదే చెప్పేవి పచ్చి అబద్దాలు. టీడీపీ మేనిఫెస్టో నెట్ నుంది తొలగించారని చెప్పేది కూడా కొండంత అబద్ధం. మద్య నిషేదం చేసి ఓట్లు అడుగుతానని, వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని, విద్యుత్ ఛార్జీలు పెంచనని, అంగన్‌వాడీలకు తెలంగాణ రాష్ట్రానికన్నా రూ.1,000 అదనంగా ఇస్తానని జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పారు.
జాబ్ క్యాలెండర్ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, రాజధానిగా అమరావతిని మార్చమని, ధరలు అదుపులో పెడతామని, ఇద్దర బిడ్డలకు అమ్మ ఒడి ఇస్తామని ఇలా జగన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 85% అమలు చేయకుండా మాట తప్పి మడమ తిప్పిడమే కాకుండా 99% హామీలు అమలు చేశామని జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పారు. దీనిపై బహిరంగ చర్చకు చంద్రబాబు సవాల్ చేశారు. జగన్ చెప్పేవన్నీ నిజాలైతే బహిరంగ చర్చకు రాకుండా ఎందుకు వెన్ను చూపుతున్నారు సజ్జల?
సంక్షేమంపై కూడా జగన్ రెడ్డి చెప్పేవి అబద్దాలే. రూ.10 ఇచ్చి పేదల దగ్గర వంద కొట్టేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు నిలదీస్తున్నారు. వాహనమిత్రకు రూ.10 వేలు ఇచ్చి, రెండో వైపు ప్రెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి, గ్రీన్ టాక్స్, పోలీస్ జరిమానాలు, మద్యం రేట్లు పెంచి డ్రైవర్ నుండి ఏడాదికి లక్ష కొట్టేస్తున్నారు. అమ్మ ఒడికి రూ.13,000 ఇచ్చి నాన్న బుడిలో లక్ష కొట్టేస్తున్నారు. ఇలా నవరత్నాలు నవ మోసాలయ్యాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు పెంచి ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపారు.
డిబిటి ద్వారా 2.5 లక్షలు సరే, తెచ్చిన 12 లక్షల కోట్ల అప్పులు ఎటుపోయాయి? వేసిన పన్నులు పెంచిన ఛార్జీల నుండి వచ్చిన లక్షల కోట్లు ఎవరు మింగారు? 2004లో హైదరాబాద్‌లో ఉన్న ఇళ్లు అమ్ముకొనే స్థితిలో ఉన్న జగన్ రెడ్డి నేడు 6 లక్షల కోట్ల ఆస్తులకు అధిపతి ఎలా అయ్యాడు?
50 కంపెనీలు, 5 ప్యాలెస్‌లు, వేల ఎకరాలు ఎలా వచ్చాయి? నాశిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేశారు. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయి వారి భార్యల మాంగళ్యాలు మంట కలిశాయి. దీని కారణం నాశిరకం మద్యంలో లక్ష కోట్ల అవినీతి కారణం కాదా!
అన్న క్యాంటీన్లు, చంద్రన్న భీమా, నిరుద్యోగ భృతి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పండుగ కానుకలు, ఆదరణ లాంటి 120 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు కాదా! SC, ST, BC, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్షల కోట్లు దారి మళ్ళిచడం పెత్తందారీ తనం కాదా! బహు జనులకు చెందిన 14 లక్షల ఎకరాలు కొట్టేయ్యడం పెత్తందారి తనం కాదా! 1.4 లక్షల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం పెత్తందారీ తనం కాదా!
ప్రశ్నించిన ప్రజల్ని, ప్రతిపక్షాలపైన, మీడియాపైనా దాడులు చేయడం, ఆస్తులు విధ్వసం చేయడం పెత్తందారీ తనం కాదా! జగన్ పెత్తందారీ తనాన్ని చంద్రబాబుకు అంటకట్టి.. చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజం కాదా! పేదల ద్రోహి జగన్ – పేదల బాంధవుడు చంద్రన్న. ఈ నిజాల నిగ్గు తేల్చుకోవాలంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాము.