Suryaa.co.in

Features

భారత్ బాగుపడితే ప్రపంచం బాగుపడుతుంది

స్వదేశీ అంటే ‘భారత్ కు మేలుచేసేది , భారతీయులచేత చేయబడినది , భారతీయులకోసం చేయబడినది.
What is Dharmic Economy?
మన భారతదేశంలో per capita income అధికంగా కలిగిన నగరం / పట్టణం ఏది ? అని మనం MBA , M.Com లాంటి చదువులు చదివిన వారిని,లేదా లెక్చరర్లను లేదా ఇతరులను అడిగినా వచ్చే జవాబు ఏది ?
1. ముంబాయి 2. దిల్లీ 3. బెంగళూరు 4. చెన్నై 5. హైదరాబాద్ అనే కదా ?
నిజానికి ఇవేవీ కావు. దేశంలో అత్యధిక per capita income కలిగిన పట్టణం పేరు ” మోర్బీ ”. గుజరాత్ లోని రాజ్ కోట్ కు 60 కి.మీ. దూరంలో వుంటుంది.
ఆ పట్టణం జనాభా [ 2018 లో] 2.4 లక్షలు మాత్రమే. కానీ అందులో 1.4 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
మోర్బీ లో 1200 సెరామిక్ యూనిట్లు , 1000 వజ్రాల తయారీ యూనిట్లు , 1000 textile యూనిట్లు వున్నాయి.
ప్రపంచంలోనే అత్యుత్తమైన గోడ గడియారాలలో ఒకటైన Samay గోడ గడియారాలను మోర్బీలో కుటీర పరిశ్రమల్లో [ cottage industries ] తయారుచేస్తారు.
ఆశ్చర్యమేమంటే దేశంలోనే అత్యధిక Per Capita Income వుండటానికి కారణమైన ఈ అన్ని పరిశ్రమలను స్థాపించిన వారికి ఇంగ్లీషు లో ఒక వాక్యం చెప్పడానికి కూడా రాదు.
ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిలో 68.5 % మంది 10 వ తరగతి కూడా చదవలేదు.
ఆ పట్టణం లో పర్యటించిన ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఈ మధ్య ఒక ఆసక్తికరమైనమాట అన్నారు : All EMPLOYERS here are UNEDUCATED and all EMPLOYEES here are educated.
తమిళనాడులో తిరుపూర్ పట్టణం వుంది. ఈ ఒక్క పట్టణమే ప్రతి ఏడాదీ 600 కోట్ల రూపాయల గుడ్డలు [ knit wear ] ఎగుమతి చేస్తుంది.
అక్కడ పనిచేస్తున్న వారిలో 68.5 % వ్యక్తులు 5 వ తరగతి దాటలేదు. కేవలం 7 % మంది మాత్రమే డిగ్రీ దాకా వచ్చారు.
ఇంగ్లీషు వచ్చివుండాలి , కోటు , సూటు వేసుకొనివుండాలి , పెద్ద చదువులు చదివివుండాలి … అనే అభిప్రాయాలను తప్పని నిరూపిస్తున్నారు ఇలాంటి అద్భుత విజయాలు సాధిస్తున్న మన వాళ్ళు.
Entrepreneurship కు పెద్ద చదువులు , ఇంగ్లీషు అక్కరలేదని తెలుస్తోంది కదా. కానీ చదువుకోకండి , ఇంగ్లీషు భాషను తరిమివేయండి అని నేను అనట్లేదు. అవివుంటేనే మనుషులు అన్నంత స్థాయిలో ప్రచారం చేయడాన్ని తప్పు అంటున్నాను.
గత వంద ఏళ్ళుగా మన దేశం కమ్యూనిస్టు ఆర్థికవిధానాన్ని , తరువాత క్యాపిటలిస్టు ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూ దెబ్బతినింది.
1750 లో ప్రపంచ GDP లో భారత్ వాటా 24.5 % , అదే సమయంలో ఇంగ్లాండు వాటా కేవలం 1.8 % , అమెరికాది మరీ దారుణం – కేవలం 0.1 % .
కానీ ఇపుడు [ 2020-21] లో ప్రపంచ GDP లో భారత్ వాటా కేవలం 3.28 % , అమెరికా వాటా అమాంతం పెరిగి 24.5 % అయ్యింది. అంటే అమెరికా అనుసరించే capitalist ఆర్థిక విధానం మంచిది అనికాదు. అది అమెరికా కు suit అయ్యింది. భారత్ కు suit అవ్వదు.
అమెరికా కు ఏది మంచిదో అది అందరికీ మంచిదికాదు , రష్యాకు ఏది మంచిదో అది అందరికీ మంచిది కాదు. భారత్ కు ఏది మంచిదో అదే భారత్ అనుసరించాలి.
భారత్ కు ఏది మంచిది ? ఈ ప్రశ్నకు జవాబు ‘ స్వదేశీ ‘.
‘ స్వదేశీ ‘ అనగానే ‘ విదేశీకి వ్యతిరేకం ‘ అనికాదు. నేను నా తల్లిని ప్రేమిస్తాను అంటే , దాని అర్థం నా తండ్రిని ద్వేషిస్తాను అని కాదు కదా ! స్వదేశీ అంటే ‘భారత్ కు మేలుచేసేది , భారతీయులచేత చేయబడినది , భారతీయులకోసం చేయబడినది.’ అవసరం అయితే తప్ప , విదేశీ వస్తువులు వాడకుండా వుండటం. దేశంలో ఏ ప్రాంతంలో వున్న ప్రజలు ఆ ప్రాంతంలో పండే పంటలు , వండే వంటలు , తయరయ్యే వస్తువులు , పలికే భాష , తొడుక్కొనే గుడ్డలు వాడటం. అమెరికన్లు మనలాగా వుండాల్సిన అవసరం లేదు , మనం ఇంగ్లీషు , అమెరికా వాళ్ళలాగా వుండల్సిన అవసరం లేదు.
అందరూ కాపిటలిస్టు ఆర్థిక విధానమే అనుసరించాలని అమెరికా , కమ్యూనిస్టు విధానమే అనుసరించాలని సోవియట్ రష్యా [ 1990] దాకా మనను ఒత్తిడిచేసాయి.
మన పాలకులు 1947 నుంచీ ఈరెండింటి మాయలో పడ్డారు. కానీ అది తప్పని , ఆరెండు ఆర్థిక విధానాలు మనకుమేలు చేయలేదని కాలం నిరూపించింది.
ఇక మిగిలింది మూడవ ఆర్థిక విధానం మాత్రమే. అదే Dharmic Economy. అది భారతదేశంలో మొదలౌతున్నది. ప్రపంచానికి మేలు చేయగలిగిన హృదయమూ , సత్తా భారత్ కు వున్నాయి. అది ప్రపంచానికి కూడా మేలు చేస్తుంది. ఇందుకు చక్కటి ఉదాహరణ – పూర్తిగా స్వదేశీ పరిఙ్ఞానం తో మనం తయారుచేసుకొన్న , ప్రపంచంలో 110 దేశాలకూ అందించిన ‘Covaxin టీకానే. [ నా అభిప్రాయం ఏమంటే ఈసారి మన కేంద్రప్రభుత్వం ” భారతరత్న ” పురస్కారాన్ని Covaxin , Covishield లకు ఇవ్వాలి]
అమెరికాకు ఎదురులేకపోతే అది ఒక తాలిబన్ ను , ఆఫ్ఘనిస్తాన్ ను ను సృష్టిస్తుంది , చైనాకు ఎదురులేకపోతే అది కరోనాను సృష్టిస్తుంది , కానీ భారత్ బలపడితే అది Covaxin ను సృష్టించి ప్రపంచాన్ని ఆదుకొంటుంది.

LEAVE A RESPONSE