Suryaa.co.in

Andhra Pradesh

షర్మిలనే తనకు రక్షణ లేదని చెబుతుంటే ప్రజలకెలా రక్షణ ఉంటుంది?

-బాబాయిని ఎవరు చంపారు?
-టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ
-వైసీపీకి నేను మూర్ఖుడిని
-మడకశిర శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

యువగళం పాదయాత్ర సమయంలో నేను ఇక్కడకు రాలేకపోయాను, క్షమించండి. ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం.

ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మర్రిమాను ఉన్న పుణ్యభూమి అనంతపురం. కష్టాన్ని నమ్ముకున్న వారు అనంతపురం జిల్లా ప్రజలు. మీకు మంచిచేస్తే ప్రేమ చూపిస్తారు. తప్పుచేస్తే పాతాళానికి తొక్కేస్తారు. ఇంతటి పుణ్యభూమిపై రెండోసారి పర్యటిస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నా.

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. విశాఖకు మూడు పనులు చేశారు. మొదటిది రూ.500 కోట్ల ఖర్చుతో ప్యాలెస్ కట్టుకున్నాడు. బాత్ రూమ్ లో 25 లక్షలు ఖర్చుపెట్టారు.
బాబాయిని ఎవరు చంపారు. జగన్, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పైవన్నీ. నాలుగో ఆప్షన్ కరెక్ట్. ముందు గుండెపోటు అన్నారు. తర్వాత శవానికి కుట్లు వేసి పక్కదారి పట్టించాలనుకున్నారు. తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబుపై నెపం వేశారు. నేడు వివేకా కూతురు సునీత వచ్చి నిజం చెప్పారు. హంతకులు పాలకులు అయ్యారని సునీత చెప్పారు.

విలువలు, విశ్వసనీయత అని చెప్పే జగన్.. సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జగన్ ను తరిమితరిమి కొట్టాలని సునీత చెప్పారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ వెళ్తే జగన్ అడ్డుకున్నారని సునీత చెప్పారు.

సొంత తల్లి, చెల్లిని తరిమేసిన వ్యక్తి జగన్ రెడ్డి. సొంత చెల్లి షర్మిలనే తనకు రక్షణ లేదని చెబుతుంటే ప్రజలకెలా రక్షణ ఉంటుంది? వివేకా హత్య కేసు దోషులను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో మేం జైలుకు పంపిస్తాం. జగన్ అద్భుతమైన కటింగ్, ఫిటింగ్ మాస్టర్. బల్లపైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో 10వేస్తాడు. రెడ్ బటన్ తో 100 లాగేస్తారు.

కరువుసీమకు కియాను తీసుకువచ్చి 50వేల ఉద్యోగాలు ఇచ్చారు మన చంద్రబాబు. అనంతపురం జిల్లాను పెద్దఎత్తున మనం అభివృద్ధి చేశాం. లక్షా 30వేల మంది రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ను చంద్రబాబు అందించారు. హార్టికల్చర్ హబ్ గా అనంతపురాన్ని తీర్చిదిద్దారు. ఒకే ఏడాదిలో రైతులకు రూ.2వేల కోట్లు ఇన్ పుట్ సబ్సీడీ అందించారు.

హంద్రీ-నీవా ప్రాజెక్టు ఫేజ్-2, హెచ్ఎల్ సీ హైలెవన్ మెయిన్ కెనాల్, మిడ్ పెన్నా సౌత్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, ధర్మవరం బ్రాంచ్ కెనాల్ పనులు చేశాం. రోడ్లు, బ్రిడ్జిలు, సాగునీటి పథకాలు కట్టామంటే అది టీడీపీ హయాంలోనే కట్టాం.

పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం. టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు వైసీపీ శిలాఫలకాలు వేస్తోంది. అవి నేడు దిష్టిబొమ్మలుగా మారాయి. 840 కోట్లతో మనం మెగా డ్రిప్ ఇరిగేషన్ పథకం చేపడితే నేడు రద్దు చేశారు.

టీడీపీ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వేలకోట్లు ఖర్చుపెట్టి పనులు చేశాం. ఆనాడు తిప్పేస్వామి, ఈరన్న నాయకత్వంలో పెద్దఎత్తున అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేశాం. అంగన్ వాడీ భవనాలు, మూడు గురుకుల పాఠశాలలు నిర్మించాం. ఏకంగా ఇండోర్ స్టేడియాలు కట్టిన ఘనత టీడీపీది. తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిధులు కేటాయిస్తే.. నేడు పనులు నిలిపివేశారు.

ఇక్కడొక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఉన్నారు. ఆయన అవినీతి చెబితే రోజు సరిపోదు. రైతుల వద్ద తక్కువ ధరకు భూములు కొని సెంటు స్థలాల పేరుతో డబ్బు దోచుకున్నారు. అంగన్ వాడీల పోస్టులు కూడా అమ్ముకున్నారు. ఇసుక దోచుకున్నారు. రోడ్లు వేయాలంటే ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిన పరిస్థితి. క్వారీలను కూడా వదిలిపెట్టడం లేదు. గతంలో పరిశ్రమలు తీసుకువస్తే నేడు వెనక్కి వెళ్లే పరిస్థితి. అవినీతి ఫుల్, అభివృద్ధి నిల్. ఇక్కడ ఎమ్మెల్యేకు వసూల్ రాజా అని పేరు పెడదాం. ఆనాడు పాదయాత్రలో జగన్ అనేక హామీలు ఇచ్చారు. ఏనాడూ వసూల్ రాజా పట్టించుకోలేదు. శాసనసభలో మాట్లాడలేదు.

వక్క మార్కెట్ ఏర్పాటుచేస్తామన్నారు, హంద్రీనీవా నుంచి పిల్ల కాలువల ద్వారా నీరు అందిస్తామన్నారు. పరిశ్రమలు, డిగ్రీ కాలేజీలు ఏర్పాటుచేస్తామని మాట తప్పారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి సంవత్సరంలోనే వక్క మార్కెట్ ఏర్పాటుచేసే బాధ్యత తీసుకుంటాం. పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందిస్తాం. పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాం. పెండింగ్ లో ఉన్న గురుకుల పాఠశాలలు పూర్తిచేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. పట్టు రైతులకు సబ్సీడీలు పునరుద్ధరిస్తాం.

టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ. పసుపు జెండాను చూస్తేనే నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కావాలి. టీడీపీ కార్యకర్తలకు ఒక్క పిలుపు రా.. కదలిరా అంటే చాలు. సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ప్రమాదవశాత్తు చనిపోయిన కార్యకర్తలకు రూ.2 లక్షలు అందించాం. ఇప్పటివరకు 100 కోట్లు ఖర్చు చేశాం. చనిపోయిన కార్యకర్తల పిల్లలను దత్తత తీసుకుని మా తల్లి భువనేశ్వరమ్మ చదివిస్తున్నారు.

మనపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. వచ్చే ప్రభుత్వంలో తేల్చుకుంటాం. అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, వైసీపీకి నేను మూర్ఖుడిని. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి ఉత్తమ కార్యకర్తల అవార్డులు ఇవ్వడం జరిగింది. బాగా పనిచేసే వారికి నామినేటెడ్ పదువులు వెతుక్కుంటూ మరీ వచ్చి ఇస్తాం. బాబు సూపర్ -6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నా. భారీ మెజార్టీతో సునీల్ ను శాసనసభకు పంపించాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE