రీడింగ్‌ ఆలస్యమైతే ఇలా లెక్కిస్తారు

Spread the love

(కేశబోయిన శ్రీధర్)

కరెంటు బిల్లుల జారీలో ఆలస్యంతో శ్లాబు మారిపోతుందనే ప్రచారంలో నిజం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఉదాహరణకు ఒక వినియోగదారు 222 యూనిట్లు వాడారు. ఆ నెల ప్రకారం 31 రోజులకు బిల్లు చేయాలి. కానీ 35 రోజులకు రీడింగ్‌ తీశారు. అప్పుడు.. 222 యూనిట్లను 35 రోజులతో భాగిస్తే.. ఒక్కరోజులో కాల్చే యూనిట్ల సగటు 6.34 వస్తుంది. దీన్ని ఆ నెలలో మొత్తం రోజులు 31తో గుణిస్తే 197 యూనిట్లు వచ్చింది.

200 యనిట్లలోపు ఉన్నందున ఆ ప్రకారమే బిల్లు ఇస్తారు. మామూలుగా అయితే 1 నుంచి 100 యూనిట్ల వరకు ఒక శ్లాబు, 101 నుంచి 200 వరకు మరో శ్లాబుగా ఉంటుంది. కానీ ఆలస్యం కారణంగా 200 యూనిట్లు దాటినందున పెరిగిన దామాషాలో 1 నుంచి 100 యూనిట్ల వరకు ఉన్న శ్లాబును పెంచుతారు. 222 యూనిట్ల ఉదాహరణలో 1 నుంచి 113 యూనిట్ల వరకు ఒకే రేటు ఉంటుంది. మిగిలిన యూనిట్లను రెండో శ్లాబులో పరిగణనలోకి తీసుకుంటారు.

అంటే 1 నుంచి 113 యూనిట్ల వరకు రూ.3.80, 114 నుంచి 222 వరకు రూ.4.80 చొప్పున లెక్కించి బిల్లు తీస్తారు. 200 యూనిట్లు దాటినట్టుగా పరిగణించి 1 నుంచి 200 వరకు రూ.5.50 201 నుంచి 222 వరకు 7.20 చొప్పున లెక్కించరు.

Leave a Reply