Suryaa.co.in

Telangana

విద్యుత్ కేంద్రం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే చెప్పుతో కొడతా

-ఎమ్మెల్సీ కోసం కోదండరాం పాకులాట
-తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలన్నదే కాంగ్రెస్ కుట్ర
– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి

గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, కేసీఆర్ పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారు.నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైంది.

నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్, భాజపా నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారు.ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించారు, ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయి.కమిషన్ కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదు. దురదృష్టవశాత్తూ కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయట పెట్టారు.

వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదు.కేసీఆర్ విషయంలో ఏమీ తేల్చలేమని చెప్పి… ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింది.ఛత్తీస్ ఘడ్ ఒప్పందంతో 6000 కోట్ల నష్టం కాదు… అంతకు మించి లాభం జరిగింది.లీకులను సమార్థించేలా కొందరితో ఇవాళ మాట్లాడించారు.

17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని ఛత్తీస్ ఘడ్ కు 7000 కోట్లు చెల్లిస్తే 6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుంది? ఛత్తీస్ ఘడ్ సరిపడా విద్యుత్ ఇవ్వకపోవడంతో ఎక్కువ ధరకు కొన్నారు… నష్టం జరిగిందని అంటున్నారు.

మరి, ఛత్తీస్ గడ్ ఒప్పందం లేకపోతే 17 వేల మిలియన్ యూనిట్లకు 17 వేల కోట్లు కట్టాల్సివచ్చు.ఉత్తర భారతం నుంచి కరెంట్ తీసుకోకుండా కేసీఆర్ ఫెయిల్ అయితే మళ్లీ సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది వీరు కుట్ర. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే… తెలంగాణ లేకుండా చేయాలి.

తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, పదవుల్లో ప్రతి అక్షరంలో కేసీఆర్ పేరు ఉంది.కేసీఆర్ కు మసి పూయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారుదమ్ముంటే సీఎం, మంత్రులు ఎందుకు మీడియా సమావేశం పెట్టి చెప్పలేదు?దొంగల లాగా చీకట్లో ముసుగులు వేసుకొని ఎందుకు వ్యవహరిస్తున్నారు?

6000 కోట్ల నష్టం అన్న కథనాల్లో అక్షరం, అక్షరం అబద్దమే.అవినీతి జరిగితే రమణ్ సింగ్, కాంగ్రెస్ సీఎం లకు ఇచ్చారా? నల్గొండ జిల్లాలో విద్యుత్ కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుతో కొడతాం. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా ? కోదండరాంకు నల్గొండ కనిపించడం లేదా?

నల్గొండ జిల్లా దద్దమ్మ నేతలు నాటి లాగే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నాడు ఛత్తీస్ గడ్ నుంచి రూ.3.90 కి యూనిట్ విద్యుత్ కొనకముందు జజ్జర్ నుంచి రూ. 17 రూపాయలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేసే వాళ్ళం.

కోదండరాం సూటిగా సమాధానం చెప్పాలి, డొంక తిరుగుడుగా మాట్లాడరాదు.దొంగలతో చేతులు కలిపి ఉన్న ఈర్ష్యను చాటుకుంటున్నారుబండి సంజయ్ తెలివితక్కువతనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు.కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని భాజపాకు తొందర ఉన్నట్లుంది.

కాంగ్రెస్, భాజపా వేరు కాదని… రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పని చేస్తున్నారని ఐదేళ్లుగా చెబుతున్నాం.హైదరాబాద్ లో గతంలో విద్యుత్ కోతలతో లక్షల జెనరేటర్లతో వచ్చిన శబ్ద, వాయు కాలుష్యం ఎంత? ఎంత మంది క్యాన్సర్ బారిన పడి అంటారు.

మణుగూరు విద్యుత్ తో హైదరాబాద్ లో విద్యుత్ కోతలు పోయి జెనరేటర్లు బంద్ కావడం వల్ల ఎంత మేలు జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలి.ఎక్కడో నాలుగు కిలోల బొగ్గు ఎక్కువ అయి పొగ ఎక్కువ వస్తే.. ఇక్కడ లక్షల మంది ఆరోగ్యాలు కాపాడలేదా?

తమకు ఖర్చు కంటే తక్కువ ఆదాయం వచ్చిందని ఛత్తీస్ ఘడ్ ఆంటోంటే కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారా?గతంలో యాదాద్రి విద్యుత్ కేంద్రం బంద్ చేయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రోషం ఉంటే ప్రారంభోత్సవానికి పోకూడదు.

కోదండరాం చిన్న పదవి కోసం ఆశ పడి దొంగలకు మద్దతు పలుకుతున్నారు.ఎమ్మెల్సీ పదవి కోసం కోదండరాం పాకులాడుతున్నారు.

LEAVE A RESPONSE