మొదలే శుక్రవారం..
అయిదు శుక్రవారాలు..
కొబ్బరికాయలు.. అరటిపళ్ళు..పువ్వులు…
ఇతర పూజా సామాగ్రి..
చీర.. కాసు..ఇవి కామను..
నగ..నట్ర..పులి మీద పుట్ర..!
ఎంత నిర్మలంగా ఉందామన్నా..
నిర్మల ఇంట్లోనే ఉన్నా..
పరకాలకూ టెన్షనే..
మాసం ముగిసేలోగా
దేనిపై అదనపు జీఎస్టీ పడుతుందోనని..!
దినకరా నువ్వు గమ్మునుండయ్యా..
ప్రభాకరా..నువ్వు
గుమ్మం దాటక..
మాట జవదాటక..
ఈ నెలరోజులూ కోపం తెప్పించక మరింత గమ్మునుండవయ్యా!!
– Esk