– కోర్టుకి తెలిపిన సీబీఐ
ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా ఇంగ్లండ్,ఫ్రాన్స్ దేశాల్లో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు సీబీఐ గురువారం కోర్టుకి తెలిపింది. 2015-1లో తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలోనే ఆయన ఆస్తులనుకొనుగోలు చేసినట్లు సిబిఐ తన రిపోర్టులో పేర్కొంది.
మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ సంస్థ ఐడిబిఐ బ్యాంకుకు రూ. 900 కోట్లు ఎగవేసిన కేసును సిబిఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల సిబిఐ కోర్టులో ఈ కేసుకు సంబంధించి అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. గత ఛార్జిషీట్‌లో 11 మంది నిందితుల పేర్లను సిబిఐ పేర్కొంది.
తాజాగా ఆ జాబితాలో ఐడిబిఐ బ్యాంక్ మాజీ జనరల్ మేనేజర్ బుద్ధదేవ్ గుప్తా పేరును చేర్చింది. దాస్‌గుప్తా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ 2009లో అక్రమరీతిలో విజయ్ మాల్యాకు సుమారు రూ.150 కోట్ల రుణం ఇచ్చినట్లు సిబిఐ తన నివేదికలో తెలిపింది.